చంద్ర‌బాబు తీరుకు నిర‌స‌న‌గా పాల‌మూరులో బంద్!

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ సీఎం అభ్యంత‌రం చెప్ప‌డాన్ని నిర‌సిస్తూ.. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌లు బంద్ పాటిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీడబ్ల్యూసీకి లేఖ రాయడాన్ని జిల్లా ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, విద్యాసంస్థల యజమానులు, పలు కులసంఘాలు, స్వచ్చంద సంఘాల నాయకులు, కార్మికులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు […]

Advertisement
Update:2015-07-10 04:43 IST
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ సీఎం అభ్యంత‌రం చెప్ప‌డాన్ని నిర‌సిస్తూ.. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌లు బంద్ పాటిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీడబ్ల్యూసీకి లేఖ రాయడాన్ని జిల్లా ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, విద్యాసంస్థల యజమానులు, పలు కులసంఘాలు, స్వచ్చంద సంఘాల నాయకులు, కార్మికులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు నేడు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్ పేర్కొంది.
Tags:    
Advertisement

Similar News