ప్రేమలేఖ రాసినందుకు హత్య

కర్ణాటకకు చెందిన దళిత యువకుడు అనిల్‌, మరో అగ్రకులం అమ్మాయి క్లాస్‌మేట్స్‌, మంచి స్నేహితులు, అనిల్‌ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి దగ్గరకు వెళ్ళి రహస్యంగా అమ్మాయికి ఒక ఉత్తరం (బహుశా ప్రేమలేఖ) అందించడం ఆ అమ్మాయి అన్న కంట్లో పడింది. ఆ అమ్మాయి అన్న, వాళ్ళ బంధువులు కలిసి అనిల్‌ని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ విషయం తెలుసుకుని అనిల్‌ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని, వాళ్ళ అబ్బాయిని వదిలిపెట్టమని బ్రతిమాలారు. అమ్మాయి బంధువులు అనిల్‌ […]

Advertisement
Update:2015-07-09 08:06 IST
ప్రేమలేఖ రాసినందుకు హత్య
  • whatsapp icon

కర్ణాటకకు చెందిన దళిత యువకుడు అనిల్‌, మరో అగ్రకులం అమ్మాయి క్లాస్‌మేట్స్‌, మంచి స్నేహితులు, అనిల్‌ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి దగ్గరకు వెళ్ళి రహస్యంగా అమ్మాయికి ఒక ఉత్తరం (బహుశా ప్రేమలేఖ) అందించడం ఆ అమ్మాయి అన్న కంట్లో పడింది. ఆ అమ్మాయి అన్న, వాళ్ళ బంధువులు కలిసి అనిల్‌ని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ విషయం తెలుసుకుని అనిల్‌ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని, వాళ్ళ అబ్బాయిని వదిలిపెట్టమని బ్రతిమాలారు. అమ్మాయి బంధువులు అనిల్‌ తల్లిదండ్రుల్ని కూడా తీవ్రంగా కొట్టారు. వాళ్ళు ఆస్పత్రి పాలయ్యారు. మరునాటి ఉదయం అనిల్‌ మృతదేహం దగ్గల్లోని పొలాల్లో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, నిందుతుల కోసం వెతుకుతున్నామని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News