ఆదిలాబాద్‌లో కప్పల పెళ్లిళ్లు!
వానావానా వల్లప్ప… వానలు కురవాలి చెల్లప్ప అని పాడుకుంటూ కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించగానే కురిసిన అరకొర వర్షాలకు విత్తులు వేసుకున్న రైతులు ఇపుడు అదును దాటిపోతున్నా చినుకు రాలకపోవడంతో ఆందోళనచెందుతున్నారు. వర్షాలు పడతాయన్న నమ్మకంగా చాలా ఊళ్లలో రైతులు కప్పలకు పెళ్లిళ్లు చేసి ఊరేగిస్తున్నారు. కప్పతల్లి ఆటలు అని పిలుస్తారు. కర్రలకు వేపాకు మండలు కట్టి వాటికి కప్పలను కట్టి నీళ్లు చల్లుతూ ఇంటింటికీ తిరుగుతారు. ఆటలు ఆడుతూ […]
Advertisement
వానావానా వల్లప్ప… వానలు కురవాలి చెల్లప్ప అని పాడుకుంటూ కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించగానే కురిసిన అరకొర వర్షాలకు విత్తులు వేసుకున్న రైతులు ఇపుడు అదును దాటిపోతున్నా చినుకు రాలకపోవడంతో ఆందోళనచెందుతున్నారు. వర్షాలు పడతాయన్న నమ్మకంగా చాలా ఊళ్లలో రైతులు కప్పలకు పెళ్లిళ్లు చేసి ఊరేగిస్తున్నారు. కప్పతల్లి ఆటలు అని పిలుస్తారు. కర్రలకు వేపాకు మండలు కట్టి వాటికి కప్పలను కట్టి నీళ్లు చల్లుతూ ఇంటింటికీ తిరుగుతారు. ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ కప్పలతో ఊరేగడం వల్ల వానదేవుడు సంతోషించి వర్షాలు కురిపిస్తాడని వీరి నమ్మకం.
ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ రైతులు పత్తి, సోయా పంటలు పండిస్తారు. జూన్‌లో వర్షాలు కురవడంతో రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు నాటారు. జులైలో చినుకు కనిపించకపోవడంతో రైతుల ఆందోళన అంతాఇంతా కాదు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 6 లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటినట్లు అధికారిక సమాచారం. 2.65 హెక్టార్లలో పత్తి, 79,000హెక్టార్లలో సోయా నాటినట్లు తెలుస్తోంది. అక్కడక్కడా మొలకలు వచ్చిన చోట్ల రైతులు ఎద్దుల బండ్లపై డ్రమ్ములలో నీరు తీసుకువచ్చి పోస్తూ ఆ మొక్కలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement