నోటు కేసులో సండ్రకు 2 రోజులు ఏసీబీ కస్టడీ
ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్యకు రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. విచారణ సమయంలో ఓ డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలని, థర్డ్ డిగ్రీని ప్రయోగించరాదని ఆదేశించింది. ఆయనకు అనారోగ్యం ఉన్నందున ఏసీబీ కార్యాలయంలో ప్రత్యేక వసతులు కల్పించాలని, న్యాయవాది సమక్షంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరపాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య చాలా కీలకమైన నిందితుడు కాబట్టి ఆయనను […]
Advertisement
ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్యకు రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. విచారణ సమయంలో ఓ డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలని, థర్డ్ డిగ్రీని ప్రయోగించరాదని ఆదేశించింది. ఆయనకు అనారోగ్యం ఉన్నందున ఏసీబీ కార్యాలయంలో ప్రత్యేక వసతులు కల్పించాలని, న్యాయవాది సమక్షంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరపాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య చాలా కీలకమైన నిందితుడు కాబట్టి ఆయనను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం అన్ని కోణాల్లో కేసును పరిశీలించిన తర్వాత విచారణకు రెండు రోజులు సరిపోతాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. విచారణ పూర్తయిన తర్వాత ఈ నెల 11వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు పరచాలని కోర్టు సూచించింది. కాగా తనకు ఆరోగ్యం బాగోలేదని, అందుచేత ఎప్పుడు అవసరమయితే అప్పుడు విచారణకు వస్తానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సండ్ర పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈకేసులో సండ్రకు బెయిల్ ఇవ్వరాదని, ఆయనను కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించాల్సి ఉందని ఏసీబీ వాదించింది. ఓటుకు నోటు కేసులో నగదు ముట్టజెప్పడానికి ఏర్పాట్లన్నీ సండ్ర నుంచే జరిగాయని ఏసీబీ తన వాదనలో వినిపించింది. ఇరుపక్షాల వాదనలను, పూర్వాపరాలను విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేశారు.
Advertisement