పట్టిసీమ’లో బాబుకు బాగానే ముట్టింది: ఎమ్మెల్యే నాని

పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీగానే ముట్టిందని, అందుకే దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి సొంత లాభం కోసమే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. పోలవరం కాలువ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఒకే ధర నిర్ణయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Advertisement
Update:2015-07-05 07:19 IST

Tags:    
Advertisement

Similar News