చంద్ర‌బాబుకు స్వ‌ర‌ప‌రీక్ష‌! ఏసీబీ మెమో నేడు విచార‌ణ‌ ?

 ఓటుకు కోట్లు కేసు మ‌ర‌లా ఊపందుకోబోతున్న‌ది. ఈ విష‌యంలో తెలంగాణ ఏసీబీ మ‌రోమారు దూకుడు పెంచ‌బోతున్న‌ట్లు జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు స్వ‌ర ప‌రీక్ష నిర్వ‌హించేందుకు అనుమ‌తించాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖ‌లు చేశార‌ని స‌మాచారం. దీనిపై కోర్టు శుక్ర‌వారం విచార‌ణ జ‌రిపే అవ‌కాశం ఉంది. ఈ కేసులో అత్యంత కీల‌కంగా మారిన‌  ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేట‌రీ) తుది నివేదిక గురువార‌మే ఏసీబీ కోర్టుకు చేరింద‌ని స‌మాచారం. ఇంతకుముందు […]

Advertisement
Update:2015-07-03 03:07 IST
ఓటుకు కోట్లు కేసు మ‌ర‌లా ఊపందుకోబోతున్న‌ది. ఈ విష‌యంలో తెలంగాణ ఏసీబీ మ‌రోమారు దూకుడు పెంచ‌బోతున్న‌ట్లు జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు స్వ‌ర ప‌రీక్ష నిర్వ‌హించేందుకు అనుమ‌తించాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖ‌లు చేశార‌ని స‌మాచారం. దీనిపై కోర్టు శుక్ర‌వారం విచార‌ణ జ‌రిపే అవ‌కాశం ఉంది. ఈ కేసులో అత్యంత కీల‌కంగా మారిన‌ ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేట‌రీ) తుది నివేదిక గురువార‌మే ఏసీబీ కోర్టుకు చేరింద‌ని స‌మాచారం. ఇంతకుముందు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఎఫ్‌ఎస్‌ఎల్ ఇపుడు పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు అందించింది. వీడియో, ఆడియోలన్నీ వాస్తవమైనవేనని, ఎలాంటి కట్ పేస్టులు, టాంపరింగులు జరగలేదని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఆడియో టేపుల‌లోని వాయిస్ చంద్రబాబుదేనని ధృవీకరించేందుకు వాయిస్ రీకాల్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకోసం బాబుకు నోటీసులు జారీ చేస్తామని ఏసీబీ అధికారులంటున్నారు. అయితే నేరుగా నోటీసులు పంపించడమా లేక కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడమా అనేది ఇంకా నిర్ణయించలేదని వారు పేర్కొంటున్న‌ట్లు స‌మాచారం.
Tags:    
Advertisement

Similar News