ప్రేమించి, పెళ్లి చేసుకుని కడతేర్చాడు!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే భార్యను కడతేర్చిన ఘటన హైదరాబాద్లో జరిగింది. చిలకలగూడకు చెందిన హమత్ (25) అదే ప్రాంతానికి చెందిన రుక్సానా (20)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు షఫీ ఉన్నాడు. కొంతకాలం నుంచి భార్యను హమత్ వేధించసాగాడు. దీంతో రుక్సానా జవహర్ నగర్పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్పై వచ్చిన హమత్ కొంతకాలం దూరంగా ఉన్నాడు. రెండువారాలుగా భార్యతో […]
Advertisement
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే భార్యను కడతేర్చిన ఘటన హైదరాబాద్లో జరిగింది. చిలకలగూడకు చెందిన హమత్ (25) అదే ప్రాంతానికి చెందిన రుక్సానా (20)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు షఫీ ఉన్నాడు. కొంతకాలం నుంచి భార్యను హమత్ వేధించసాగాడు. దీంతో రుక్సానా జవహర్ నగర్పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్పై వచ్చిన హమత్ కొంతకాలం దూరంగా ఉన్నాడు. రెండువారాలుగా భార్యతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భార్యతో గొడవజరిగింది. ఆవేశంలో బండరాయి తీసుకుని రుక్సానా తలపై మోదడంతో అక్కడికక్కడే చనిపోయింది. కుమారుడిని తీసుకుని హమత్ అక్కడ నుంచి పరారయ్యాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement