చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌రెడ్డి విడుదల
చర్లపల్లి జైలు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. ఈయనతోపాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహలను కూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన విడుదల ఆర్డర్‌ను చర్లపల్లి జైలు అధికారులకు అందజేసిన అనంతరం లాంఛానలు పూర్తి చేసిన అధికారులు వారిని విడుదల చేశారు. సుమారు నెల రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నారు. మధ్యలో బెయిల్ లభించినా అది కేవలం 12 గంటలు మాత్రమే. రేవంత్ […]
Advertisement
చర్లపల్లి జైలు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. ఈయనతోపాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహలను కూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన విడుదల ఆర్డర్‌ను చర్లపల్లి జైలు అధికారులకు అందజేసిన అనంతరం లాంఛానలు పూర్తి చేసిన అధికారులు వారిని విడుదల చేశారు. సుమారు నెల రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నారు. మధ్యలో బెయిల్ లభించినా అది కేవలం 12 గంటలు మాత్రమే. రేవంత్ బయటికి వచ్చినపుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు ఆయనకు హార్దిక స్వాగతం పలికారు. నిజానికి మంగళవారమే ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్ కాపీలో జరిగిన చిన్న సాంకేతిక లోపం రేవంత్‌రెడ్డిని, ఆయన సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహలను మరో 24 గంటలపాటు జైలులోనే ఉండేట్టు చేసింది. నిజానికి మంగళవారం ఉదయమే వీరికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే బెయిల్ ఆర్డర్ కాపీలో ఉన్న తప్పును సరిదిద్దాల్సి వచ్చింది. ఈ కాపీ మాడిఫై కోసం రేవంత్ న్యాయవాదులు ఫర్‌బీయింగ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కొత్త ఆర్డర్ జారీ చేసింది. ష్యూరిటీలు, డిపాజిట్లు, బెయిల్ ఆర్డర్‌లను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో రేవంత్ తరపు లాయర్లు కోరారు. దీంతో రేవంత్‌రెడ్డి బెయిల్ ఆర్డర్‌లో సాంకేతిక పొరపాటును హైకోర్టు సరిదిద్ది కొత్త ఆర్డర్‌ను విడుదల చేసింది. ఏసీబీ కోర్టులో హైకోర్టు విడుదల చేసిన ఆర్డర్ కాపీని రేవంత్‌రెడ్డి తరపు లాయర్లు అవినీతి నిరోధక శాఖ కోర్టుకు అందజేయగా న్యాయమూర్తి వాటిని పరిశీలించి పూచీకత్తులు, జామీనులు తీసుకుని జైలు నుంచి విడుదలయ్యేందుకు కావలసిన పత్రాలు అందజేశారు. అవి పట్టుకుని మళ్ళీ లాయర్లు చర్లపల్లి జైలుకు వెళ్ళి వాటిని అందజేశారు. ఈ లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత రేవంత్‌రెడ్డితోపాటు మిగిలిన ఇద్దరు నిందితుల్నీ జైలు అధికారులు విడుదల చేశారు. మొత్తం మీద రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చర్లపల్లి జైలు వద్దే నిన్నటి నుంచి పడిగాపులు కాయాల్సి వచ్చింది. రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీ ర్యాలీతో తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
Advertisement