రేవంత్ వస్తువులన్నీ చర్లపల్లి ఖైదీలకే!
ఓటుకు కోట్లు కుంభకోణంలో ఆరోపణలపై నెల రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంతకాలం అక్కడ తాను వినియోగించిన వస్తువులన్నిటినీ అక్కడి తోటి ఖైదీలకు ఇచ్చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత రేవంత్ వినియోగించిన వస్తువులను తమకు ఇవ్వాలని ఖైదీలు కోరారు. దాంతో తాను వాడిన దిండ్లు, దుప్పట్లు, దుస్తులు, బూట్లువంటి వాటినన్నింటినీ ఆయన అడిగినవారికి అడిగినట్లు ఇచ్చేశారు. అయితే, మంగళవారం రాత్రి కూడా ఆయన అక్కడే ఉండాల్సి ఉందని తెలిసిన […]
Advertisement
ఓటుకు కోట్లు కుంభకోణంలో ఆరోపణలపై నెల రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంతకాలం అక్కడ తాను వినియోగించిన వస్తువులన్నిటినీ అక్కడి తోటి ఖైదీలకు ఇచ్చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత రేవంత్ వినియోగించిన వస్తువులను తమకు ఇవ్వాలని ఖైదీలు కోరారు. దాంతో తాను వాడిన దిండ్లు, దుప్పట్లు, దుస్తులు, బూట్లువంటి వాటినన్నింటినీ ఆయన అడిగినవారికి అడిగినట్లు ఇచ్చేశారు. అయితే, మంగళవారం రాత్రి కూడా ఆయన అక్కడే ఉండాల్సి ఉందని తెలిసిన తర్వాత వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చినట్లు సమాచారం. రేవంత్ బుధవారం జైలు నుంచి విడుదలయ్యేటపుడు ఆ వస్తువులన్నీ అక్కడి ఖైదీలకే ఇచ్చి వచ్చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పూచీకత్తు ఫార్మాలిటీలను కోర్టు సమయం లోగా పూర్తి చేయకపోవడంతో బెయిల్ మంజూరైనా రేవంత్ మంగళవారం రాత్రి కూడా జైలులోనే ఉండాల్సి వచ్చింది.
Advertisement