సండ్రకు నేటితో ముగియనున్న గడువు!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ పోలీసులను కోరిన పదిరోజుల గడువు నేటితో తీరిపోనుంది. ఓటుకు కోట్లు కుంభకోణంలో ఆయన ఏసీబీ ఈనెల 16న నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అనారోగ్య కారణాలతో తాను విచారణకు హాజరుకాలేనని పదిరోజులు విశ్రాంతి అవసరమని జూన్ 19న ఏసీబీ పోలీసులకు పంపిన లేఖలో గడువు కోరారు. కావాలంటే ఆసుపత్రికి వస్తే విచారణకు సహకరిస్తానన్న సండ్ర తాను ఎక్కడ చికిత్స పొందుతున్నది మాత్రం […]
Advertisement
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ పోలీసులను కోరిన పదిరోజుల గడువు నేటితో తీరిపోనుంది. ఓటుకు కోట్లు కుంభకోణంలో ఆయన ఏసీబీ ఈనెల 16న నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అనారోగ్య కారణాలతో తాను విచారణకు హాజరుకాలేనని పదిరోజులు విశ్రాంతి అవసరమని జూన్ 19న ఏసీబీ పోలీసులకు పంపిన లేఖలో గడువు కోరారు. కావాలంటే ఆసుపత్రికి వస్తే విచారణకు సహకరిస్తానన్న సండ్ర తాను ఎక్కడ చికిత్స పొందుతున్నది మాత్రం లేఖలో పొందుపరచలేదు. కనీసం సెల్ నెంబరు కూడా పేర్కొనలేదు. మరోవైపు ఆయన ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివిధ మీడియాలో వార్తలు రావడం ఏపీ సర్కారు, పోలీసులను ఇరుకున పడేసింది. దీంతో సండ్ర కావాలనే విచారణకు రాలేదని, ఆయనకు ఏపీ సర్కారు సహకరిస్తోందని ఏసీబీ భావిస్తోంది. ఒకవేళ సండ్ర చెబుతున్న వివరాల ప్రకారం.. ఆయన పదిరోజుల విశ్రాంతి నేటితో ముగియనుంది. ఆయన ఏసీబీ విచారణకు వస్తారా? రారా? అన్నది అనుమానమే! దీంతో రాకపోతే ఏం చేయాలి? అన్న విషయంపై ఇప్పటికే ఏసీబీ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
Advertisement