ఉత్తరాఖండ్ వరదల్లో 140 మంది తెలుగువారు విలవిల
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన 140 మంది తెలుగువారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడి రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల వంతెనలు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హిందూపురం నుంచి బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన 140 మంది యాత్రికులు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. వారంతా అక్కడ ఒక సత్రంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. రోడ్లు తెగిపోవడంతో నాలుగు రోజులుగా అక్కడే అవస్థలు పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం హిందూపురంలోని బంధువులకు […]
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన 140 మంది తెలుగువారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడి రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల వంతెనలు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హిందూపురం నుంచి బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన 140 మంది యాత్రికులు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. వారంతా అక్కడ ఒక సత్రంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. రోడ్లు తెగిపోవడంతో నాలుగు రోజులుగా అక్కడే అవస్థలు పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం హిందూపురంలోని బంధువులకు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. వీరంతా అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప, కదిరి, తనకల్లు, మడకశిర ప్రాంతాలకు చెందినవారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.