సీఎం టూర్ల పెండింగ్ బిల్లులు రూ. 19 కోట్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది కాలంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటనలకు అయిన పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.19 కోట్లుకు పేరుకు పోయాయి. వీటిని ఎలా చెల్లించాలో తెలియక జిల్లా కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. హోటళ్లు, ఇతర ఏర్పాట్ల కోసం అయిన పెండింగ్ బిల్లులను చెల్లిస్తే గానీ తదుపరి ఏర్పాట్లు చేయలేమని కలెక్టర్లకు సంబంధితులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు. […]
Advertisement
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది కాలంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటనలకు అయిన పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.19 కోట్లుకు పేరుకు పోయాయి. వీటిని ఎలా చెల్లించాలో తెలియక జిల్లా కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. హోటళ్లు, ఇతర ఏర్పాట్ల కోసం అయిన పెండింగ్ బిల్లులను చెల్లిస్తే గానీ తదుపరి ఏర్పాట్లు చేయలేమని కలెక్టర్లకు సంబంధితులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎస్ చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం రూ. 3 కోట్ల చొప్పున రూ. 9 కోట్లు, మిగతా పది జిల్లాలకు రూ. కోటి చొప్పున పది కోట్లు విడుదల చేయాలని ఇటీవల ఆర్థిక శాఖను ఆదేశించారు. అయితే మొత్తం రూ.19 కోట్లు విడుదల చేయాలంటే బడ్జెట్ కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలో అదనపు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే, అదనపు నిధులను విడుదల చేసే అధికారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి మాత్రమే ఉంది. అయితే, ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే బడ్జెట్‌లో కేటాయింపులున్న మేరకే నిధులు విడుదల చేసే అధికారం ఆర్థిక శాఖ కార్యదర్శికి ఉంది. దీంతో సీఎం పర్యటన బిల్లులు పెండింగ్‌లోనే ఉండి పోయాయి.
Advertisement