ఓటుకు నోటు కేసులో ఉత్తమ్ ఎటువైపు?
ఓటుకు నోటు కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై అన్నిపార్టీల అధ్యక్షులు, నేతలు ఏపీ సీఎం చంద్రబాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తన వైఖరిని స్పష్టంచేయడం లేదు. ఈ వ్యవహారం వెలుగుచూసిన కొత్తలో ఇద్దరు సీఎంల వైఖరిని తప్పుబట్టిన ఉత్తమ్ ఆ తరువాత పెద్దగా స్పందించింది లేదు. సెక్షన్-8 అంటూ టీడీపీ కొత్తపాట అందుకోవడంపై తెలంగాణ నాయకులు, ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఈ విషయంలో ఏపీలోని పార్టీలు […]
ఓటుకు నోటు కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై అన్నిపార్టీల అధ్యక్షులు, నేతలు ఏపీ సీఎం చంద్రబాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తన వైఖరిని స్పష్టంచేయడం లేదు. ఈ వ్యవహారం వెలుగుచూసిన కొత్తలో ఇద్దరు సీఎంల వైఖరిని తప్పుబట్టిన ఉత్తమ్ ఆ తరువాత పెద్దగా స్పందించింది లేదు. సెక్షన్-8 అంటూ టీడీపీ కొత్తపాట అందుకోవడంపై తెలంగాణ నాయకులు, ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఈ విషయంలో ఏపీలోని పార్టీలు కూడా చంద్రబాబు తీరును విమర్శిస్తున్నాయి. విచిత్రంగా ఇంతవరకూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చంద్రబాబు వైఖరిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్‌లోని పాల్వాయి గోవర్దన్, పొంగులేటి సుధాకర్‌లు చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా సెక్షన్-8పై చేస్తున్నదంతా అనవసర హడావుడేనని తేల్చారు. కానీ, ఈ విషయంలో ఉత్తమ్ మౌనం వహిస్తున్నారు. బహుశా ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అన్నది అంతుబట్టడం లేదు.