మ‌త్త‌య్య కేసు 29కి వాయిదా

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు మ‌త్త‌య్య క్వాష్ పిటిష‌న్‌ను మ‌రో బెంచ్‌కు మార్చాల‌న్న స్టీఫెన్‌స‌న్ పిటిష‌న్‌పై హైకోర్టులో వాద‌న‌లు ముగిసాయి. ఈ కేసులో తీర్పు సోమ‌వారానికి వాయిదా ప‌డింది. పిటిష‌న్ల‌పై అభ్యంతరాలు ఉంటే కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఇరుపక్షాలను కోర్టు ఆదేశించింది. అంత‌కుముందు మత్తయ్య పిటిషన్‌పై కోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇరుప‌క్షాల న్యాయ‌వాదులు తీవ్ర వాదోప‌వాదాలు చేసుకున్నారు. ఒక ద‌శ‌లో న్యాయ‌మూర్తి జోక్యం చేసుకుని సంయమనం పాటించాలని న్యాయమూర్తి సూచించారు. స్టీఫెన్‌సన్‌ బాధ్యతాయుతమైన పదవిలో […]

Advertisement
Update:2015-06-25 10:26 IST
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు మ‌త్త‌య్య క్వాష్ పిటిష‌న్‌ను మ‌రో బెంచ్‌కు మార్చాల‌న్న స్టీఫెన్‌స‌న్ పిటిష‌న్‌పై హైకోర్టులో వాద‌న‌లు ముగిసాయి. ఈ కేసులో తీర్పు సోమ‌వారానికి వాయిదా ప‌డింది. పిటిష‌న్ల‌పై అభ్యంతరాలు ఉంటే కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఇరుపక్షాలను కోర్టు ఆదేశించింది. అంత‌కుముందు మత్తయ్య పిటిషన్‌పై కోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇరుప‌క్షాల న్యాయ‌వాదులు తీవ్ర వాదోప‌వాదాలు చేసుకున్నారు. ఒక ద‌శ‌లో న్యాయ‌మూర్తి జోక్యం చేసుకుని సంయమనం పాటించాలని న్యాయమూర్తి సూచించారు. స్టీఫెన్‌సన్‌ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి అని ఆయన పిటిషన్‌ను పరిగణన‌లోకి తీసుకోవాలని ఆయ‌న త‌ర‌ఫు లాయర్‌ గండ్ర మోహన్‌రావు వాదించారు. ఇందుకు మత్తయ్య తరపు న్యాయవాది సిద్ధార్త్‌ లోథా అభ్యంత‌రం చెప్పారు. కోర్టులు న్యాయమూర్తి ద్వారానే నడుస్తాయని, న్యాయం ఉన్న‌వారికే అనుకూలంగా తీర్పులొస్తాయ‌ని లోథా అన్నారు. తనకు న్యాయం జరగదంటూ బెంచ్‌ మార్చాలనడం సరికాదని ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేని వాళ్లే ఇలాంటి పిటిష‌న్లు వేస్తార‌ని మత్తయ్య త‌ర‌ఫు లాయర్‌ తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.
Tags:    
Advertisement

Similar News