పుల్లెల శ్రీరామచంద్రుడు అస్తమయం

ప్రముఖ రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో ఆయన అస్తమించారు. పుల్లెల శ్రీరామచంద్రుడు తెలుగు, సంస్కృత భాషలలో 175 పుస్త‌కాల‌కు పైగా రచనలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. 2011 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పుల్లెల శ్రీరామచంద్రుడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలం, ఇందుపల్లి గ్రామంలో జన్మించారు. మహామహోపాధ్యాయగా కీర్తించబడిన పుల్లెల శ్రీరామచంద్రుడు వివిధ సాహిత్య ప్రక్రియలలో గత 5 దశాబ్దాలుగా […]

Advertisement
Update:2015-06-25 02:54 IST
ప్రముఖ రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో ఆయన అస్తమించారు. పుల్లెల శ్రీరామచంద్రుడు తెలుగు, సంస్కృత భాషలలో 175 పుస్త‌కాల‌కు పైగా రచనలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. 2011 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పుల్లెల శ్రీరామచంద్రుడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలం, ఇందుపల్లి గ్రామంలో జన్మించారు. మహామహోపాధ్యాయగా కీర్తించబడిన పుల్లెల శ్రీరామచంద్రుడు వివిధ సాహిత్య ప్రక్రియలలో గత 5 దశాబ్దాలుగా అవిరళకృషి చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలనుండి తెలుగు భాషలోనికి 80కు పైగా అనువాదాలు చేశారు. శంకరాచార్యుని బ్రహ్మసూత్ర, గీతాభాష్యాలను అనువదించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత భాషా శాఖ ఆచార్యులుగా పలువురు శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దారు. పుల్లెల శ్రీరామచంద్రుడు తెలుగు, సంస్కృత భాష‌ల‌లో అనేక పుర‌స్కారాలు అందుకున్నారు.
Tags:    
Advertisement

Similar News