ఫిరాయింపులపై హైకోర్టులో నారాయణ పిటిషన్
సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ఏది మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన మరో సంచలనం సృష్టించారు. ఫిరాయింపులపై హైకోర్టులో పిల్ వేశారు. రాజ్యాంగ విలువలు పాటించాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించి ఒక పార్టీ నుంచి గెలుపొందిన నాయకులు అధికార పార్టీ లోకి మారిపోవడంపై ఫిర్యాదులు కూడా సకాలంలో పరిష్కారం కావడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ […]
Advertisement
సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ఏది మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన మరో సంచలనం సృష్టించారు. ఫిరాయింపులపై హైకోర్టులో పిల్ వేశారు. రాజ్యాంగ విలువలు పాటించాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించి ఒక పార్టీ నుంచి గెలుపొందిన నాయకులు అధికార పార్టీ లోకి మారిపోవడంపై ఫిర్యాదులు కూడా సకాలంలో పరిష్కారం కావడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని తన పిల్‌లో నారాయణ ప్రస్తావించారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థించారు.
Advertisement