కేసీఆర్ ఎందుకు యోగాలో పాల్గొనలేదు?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రాన్ని మెప్పిస్తూ తనకు కావలసినవి చేసుకునేందుకు సంసిద్ధులయ్యారని చాలామంది అనుకున్నారు. ఈ యోచనలో భాగంగానే ఆయన స్వచ్ఛ భారత్ నమూనాలో స్వచ్ఛ హైదరాబాద్‌ను చేపట్టి కేంద్రంతోపాటు అందరి దృష్టిని ఆకర్షించారు. కాని ప్రపంచ వ్యాప్తంగా భారత్ స్ఫూర్తితో చేపట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేసీఆర్ దూరంగా ఉండడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు రకరకాల జవాబులు దొరుకుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎంఐఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది కాబట్టి త్వరలో జరగబోయే హైదరాబాద్ […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రాన్ని మెప్పిస్తూ తనకు కావలసినవి చేసుకునేందుకు సంసిద్ధులయ్యారని చాలామంది అనుకున్నారు. ఈ యోచనలో భాగంగానే ఆయన స్వచ్ఛ భారత్ నమూనాలో స్వచ్ఛ హైదరాబాద్‌ను చేపట్టి కేంద్రంతోపాటు అందరి దృష్టిని ఆకర్షించారు. కాని ప్రపంచ వ్యాప్తంగా భారత్ స్ఫూర్తితో చేపట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేసీఆర్ దూరంగా ఉండడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు రకరకాల జవాబులు దొరుకుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎంఐఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది కాబట్టి త్వరలో జరగబోయే హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో దోస్తి కట్టాలంటే ఇప్పటి నుంచి ఆ పార్టీని మంచి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ యోగా కార్యక్రమానికి దూరంగా ఉన్నారని అంటున్నారు. ఒకరికి దగ్గరవ్వాలంటే మరొకరికి దూరంగా ఉండాలన్న రాజకీయ సిద్దాంతంలో భాగమే ఈ నిర్ణయానికి కారణంగా భావించాల్సి వస్తోంది. అయితే మరో కీలకమైన అంశం ఏమిటంటే… గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల ఫలితమే కేసీఆర్ యోగాకు దూరంగా ఉన్నారన్న వాదన కూడా లేకపోలేదు. ఓటుకు నోటు కేసులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి కినుక వహించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. చంద్రబాబు మీద దూకుడుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కళ్ళెం వేసే విధంగా కేంద్రం వైఖరి ఉందని, కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి అయిన కె.తారకరామారావు ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దూకుడు తగ్గింది. దీనికి కారణం కేంద్రం రాయబారమేనని తెలుస్తోంది. దీనిపై అలక వహించిన కేసీఆర్ కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్నది మరో వాదన. మొత్తం మీద ప్రపంచమంతా యోగా కార్యక్రమానికి చేపడితే కేసీఆర్ మాత్రం ఇదేమీ తనకు పట్టనట్టు వ్యవహరించడమే ఇపుడు చర్చనీయాంశం!
Advertisement