ఉద్యోగం ఎర‌తో యువ‌తిపై గ్యాంగ్ రేప్‌

అత్యాచారాల‌కు అంతే లేకుండా పోతోంది. చ‌ట్టాలెన్ని ఉన్నా అవి చ‌ట్టుబండ‌లే అవుతున్నాయి. క్ష‌ణికావేశంలో చేసిన త‌ప్పుకు జీవితాంతం క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని తెలిసినా… కారాగారం వెన‌క్కి వెళ్ళి ఊచ‌లు లెక్కించాల్సి వ‌స్తుంద‌ని తెలిసినా… త‌ప్పులు చేయ‌డం మానడం లేదు. తాజాగా మ‌రో మాన‌వ మృగం ఓ యువ‌తి మానాన్ని క‌బ‌ళించింది. ప‌శ్చిమ‌బెంగాల్‌ గుర్గావ్‌లో ఓ యువతిపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి ఒడి గట్టారు. కుటుంబ‌ పోషణ కోసం ఉద్యోగం వెతుకుతూ వచ్చిన ఓ 22 ఏళ్ల యువతిని ఉద్యోగం […]

Advertisement
Update:2015-06-20 11:50 IST
అత్యాచారాల‌కు అంతే లేకుండా పోతోంది. చ‌ట్టాలెన్ని ఉన్నా అవి చ‌ట్టుబండ‌లే అవుతున్నాయి. క్ష‌ణికావేశంలో చేసిన త‌ప్పుకు జీవితాంతం క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని తెలిసినా… కారాగారం వెన‌క్కి వెళ్ళి ఊచ‌లు లెక్కించాల్సి వ‌స్తుంద‌ని తెలిసినా… త‌ప్పులు చేయ‌డం మానడం లేదు. తాజాగా మ‌రో మాన‌వ మృగం ఓ యువ‌తి మానాన్ని క‌బ‌ళించింది. ప‌శ్చిమ‌బెంగాల్‌ గుర్గావ్‌లో ఓ యువతిపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి ఒడి గట్టారు. కుటుంబ‌ పోషణ కోసం ఉద్యోగం వెతుకుతూ వచ్చిన ఓ 22 ఏళ్ల యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చేప్పి గెస్ట్ హౌస్‌కు తీసుకువెళ్లి దారుణంగా హింసించి అతి దారుణంగా ఏడుగురు అత్యాచారాం చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితురాలు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. కపిల్ యాదవ్ అనే యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తమ ఆఫీస్‌గా చెప్పుకుంటున్న గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. ఇదే క్రమంలో మ‌రో ఆరుగురు స్నేహితుల‌తో కలిసి అక్క‌డికి వ‌చ్చాడు. ఆ యువ‌తిని ఆయుధాలతో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News