సాంకేతిక సవాళ్ళు అధిగమిస్తేనే దేశ రక్షణ సాధ్యం: గవర్నర్
దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక సవాళ్ళను అధిగమించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దేశభద్రతకు సంబంధించి కాలాన్ని బట్టి ఆధునిక టెక్నాలజీ వినియోగించేలా ఎంసీఈఎంఈ మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అణు ఆయుధాల దాడులు, సైబర్ నేరాల నుంచి […]
Advertisement
దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక సవాళ్ళను అధిగమించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దేశభద్రతకు సంబంధించి కాలాన్ని బట్టి ఆధునిక టెక్నాలజీ వినియోగించేలా ఎంసీఈఎంఈ మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అణు ఆయుధాల దాడులు, సైబర్ నేరాల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్రివిధ దళాల అధికారులు ఎలాంటి ఇగోలకు పోకుండా దేశ రక్షణ కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కంప్యూటర్స్ హ్యాక్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం 95వ డిగ్రీ ఇంజినీరింగ్ కోర్సులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ జి.రంగరాజన్, డీజీఈఎంఈ ట్రోఫీని, 23వ టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లెప్ట్‌నెంట్ విశాల్ సింగ్‌కు ట్రోఫీని గవర్నర్ నరసింహన్ అందజేశారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణలను వేల మైళ్ల దూరంలోవున్న వ్యక్తులు వింటున్నారని గవర్నర్ నరసింహన్ అన్నారు. ట్యాపింగ్ లేని సెల్‌ఫోన్ వ్యవస్థ రావాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Advertisement