మెరిసే దంతాల కోసం

ముత్యాల్లాంటి పలు వరుస, తెల్ల‌గా త‌ళ‌త‌ళ‌లాడుతున్న దంతాలున్న వారిని  చూస్తే ఎంత‌సేపైనా  అలా  చూస్తూ ఉండిపోవాల‌నిపిస్తుంది. మ‌రి మ‌నకు కూడా అటువంటి అంద‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన దంతాలు కావాలంటే అర‌టిపండు, స్ట్రాబెర్రీలు వాడితే స‌రి. ఇవి దంతాల‌ను స‌హ‌జ‌సిద్దంగానే  తెల్ల‌గా మెరిసేలా చేసి  ముఖానికి ఎంతో అందాన్నిస్తాయి. స్ట్రాబెర్రీలతో పండిన స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి అందులో టూత్‌బ్రెష్ ముంచి  దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా రెండు వారాలు చేస్తే దంతాలు మిలమిల మెరుస్తాయి. అయితే దంత నిపుణులు మాత్రం […]

Advertisement
Update:2015-06-20 06:29 IST

ముత్యాల్లాంటి పలు వరుస, తెల్ల‌గా త‌ళ‌త‌ళ‌లాడుతున్న దంతాలున్న వారిని చూస్తే ఎంత‌సేపైనా అలా చూస్తూ ఉండిపోవాల‌నిపిస్తుంది. మ‌రి మ‌నకు కూడా అటువంటి అంద‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన దంతాలు కావాలంటే అర‌టిపండు, స్ట్రాబెర్రీలు వాడితే స‌రి. ఇవి దంతాల‌ను స‌హ‌జ‌సిద్దంగానే తెల్ల‌గా మెరిసేలా చేసి ముఖానికి ఎంతో అందాన్నిస్తాయి.
స్ట్రాబెర్రీలతో
పండిన స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి అందులో టూత్‌బ్రెష్ ముంచి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా రెండు వారాలు చేస్తే దంతాలు మిలమిల మెరుస్తాయి. అయితే దంత నిపుణులు మాత్రం స్ట్రాబెర్రీ పండుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలంటున్నారు. స్ట్రాబెర్రీలలో సిట్రిక్‌ యాసిడ్ ఉండ‌టం వ‌ల్ల దృఢంగా ఉండే దంతాల పైభాగం దెబ్బతినే ప్రమాదం ఉందట. పైగా ఈ పండులో మాలిక్‌ యాసిడ్‌ కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీలు బాగా పండేకొద్దీ ఈ యాసిడ్‌ మరింత చిక్కగా తయారవుతుంది. ఇది సిట్రిక్‌ యాసిడ్‌ కన్నా శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఈ పండుతో చేసిన పేస్టును కాకుండా స్ట్రాబెర్రీలతోనే దంతాల పైభాగం రుద్దుకోవాలని దంత నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల దంతాల పైనున్న మరకలు పోతాయి కానీ ఈ మచ్చలకు కారణమైన మాలిక్యూల్స్‌ని మాత్రం ఇవి నిర్మూలించలేవు. కేవలం దంతాల పైభాగాన్ని మెరిసేట్టు చేస్తాయి. అందుకే స్ట్రాబెర్రీలు దంతాలను మెరిసేట్టు చేసే సున్నితమైన, శక్తివంతమైన నేచురల్‌ వైట్‌నర్‌ అని చెప్తారు.
అరటిపండుతొక్కతో…
అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీసు దంతాలపై ఉన్న మచ్చలను పోగొడతాయి. బాగా పండిన అరటి పండు తొక్కను తీసుకుని దానికి అంటుకుని ఉండే పదార్థంతో దంతాలను రెండు నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఇలా మూడువారాలు చేసిన తర్వాత దంతాలు తెల్లగా మెరుస్తాయి. దంతాల పైనుండే మచ్చలు పోతాయి. అయితే ఎనామిల్‌ లోపలికంటా ఇది పోదు. కేవలం దంతాలకు వైట్‌నర్‌గానే అరటి పండు తొక్కలోని పదార్థాలు ఉపయోగపడతాయి. మన శరీరంపై ఉన్న మృతచర్మాన్ని తొలగించినట్టే దంతాలపైనున్న మచ్చలను ఈ పండ్ల సహాయంతో తొలగిస్తున్నామన్నమాట.

Tags:    
Advertisement

Similar News