మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలు

పోలీసుల‌పై దౌర్జన్యం చేసిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. 2007 ఫిబ్రవరి 25న రాజమండ్రి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నందున 144 సెక్షన్ విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రాత్రి పూట కొంద‌రు గుమిగూడార‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్ప‌టి ఎంపీ హ‌ర్ష‌కుమార్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు. […]

Advertisement
Update:2015-06-19 05:49 IST
పోలీసుల‌పై దౌర్జన్యం చేసిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. 2007 ఫిబ్రవరి 25న రాజమండ్రి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నందున 144 సెక్షన్ విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రాత్రి పూట కొంద‌రు గుమిగూడార‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్ప‌టి ఎంపీ హ‌ర్ష‌కుమార్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌పై దౌర్జ‌న్యం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారంద‌రినీ తీసుకెళ్లిపోయారు. ఏఎస్సై ఫిర్యాదుతో ఎస్‌ఐ జి. మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ పై శిక్షను విధించారు. అనంతరం హర్షకుమార్‌ను అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యూరు.
Tags:    
Advertisement

Similar News