బాలికపై అత్యాచారం... హత్య, ప్రతీకారంగా నిందితుడి హత్య?
బాలిక లావణ్యపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సురేష్‌ను జనం అంతా కలిసి దారుణంగా చంపేశారు. అంతకుముందు నిందితుడ్ని పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన గురించి తెలిసినప్పటి నుంచి… అంటే గురువారం ఉదయం నుంచి నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ ధర్నా చేపట్టిన బాలిక వర్గానికి చెందినవారు దాన్ని శుక్రవారం కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సురేష్ పోలీసులకు చిక్కాడు. ఆతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. నిందితుడ్ని తమకు […]
Advertisement
బాలిక లావణ్యపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సురేష్‌ను జనం అంతా కలిసి దారుణంగా చంపేశారు. అంతకుముందు నిందితుడ్ని పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన గురించి తెలిసినప్పటి నుంచి… అంటే గురువారం ఉదయం నుంచి నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ ధర్నా చేపట్టిన బాలిక వర్గానికి చెందినవారు దాన్ని శుక్రవారం కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సురేష్ పోలీసులకు చిక్కాడు. ఆతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. నిందితుడ్ని తమకు అప్పగించాలంటూ ఆందోళనకారులు ధర్నాకు దిగారు. పోలీసులు ససేమిరా అనడంతో పోలీస్ వ్యాన్‌పై దాడి చేసి అతన్ని జీపు నుంచి బయటకు లాగాశారు. సురేష్ పారిపోవడానికి ప్రయత్నించగా ఏలూరు పాత బస్‌స్టాండ్ వద్ద అతన్ని పట్టుకుని దాడి చేశారు. ఈ దాడిలో నిందితుడు సురేష్ అక్కడికక్కడే మరణించాడు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే…
అయితే పోలీసుల కథనం దీనికి భిన్నంగా ఉంది…. ఏలూరు డీఎస్సీ సరిత కథనం ప్రకారం… ఆస్పత్రి నుంచి పారిపోయిన సురేష్‌ను పట్టుకోవడానికి తాము ఆరు బృందాలను నియమించారు. ఇందులో ఒక బృందానికి సురేష్ తారసపడగా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఏలూరు రైల్వే బ్రిడ్డి మీద నుంచి పట్టాల మీదకి దూకేశాడు. అతను అక్కడిక్కడే మరణించాడు. అయితే కోపోద్రేకంతో ఉన్న ఆందోళనకారులు సురేష్‌ను పట్టాల మీద నుంచి తీసుకువచ్చి మృతదేహంపై దాడి చేశారు. అంతే తప్ప సురేష్‌ను పోలీసులు పట్టుకోవడం, వాళ్ళ నుంచి ఆందోళనకారులు సురేష్‌ను వశం చేసుకుని దాడి చేసి చంపేయడం… అబద్దమని డీఎస్పీ సరిత చెప్పారు.
అసలేం జరిగిందంటే….
ఆ బాలిక పేరు లావణ్య. చదివేది ఒకటో తరగతి. ఏమైనా కొనుక్కుంటానమ్మా డబ్బులియ్… అంటూ మారాం చేసి తల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిన లావణ్య మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగింది ఈనెల 17వ తేదీ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి ఇందిరాకాలనీకి చెందిన తియ్యాల రమేష్, అనుపమ దంపతుల కుమార్తె ఈ బాలిక. తమ ఇంటికి ఎదురుగా ఉన్న గనిగంటి సురేష్ గతంలో హత్య, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే అనుమానంతో సురేష్‌ను స్థానికులంతా కలిసి చితక్కొట్టారు. అయినా తనకు ఏ పాపం తెలియదని, తనకూ ఓ కూతురు, కొడుకు ఉన్నారని ఆ పాప కూడా తన కూతురు లాంటిదేనని ప్రాధేయపడ్డాడు. దాంతో ఇంకా అనుమానం వీడకున్నా వదిలేశారు. గాయాలతో ఉన్న అతన్ని పోలీసులు ఆస్పత్రికి పంపారు. ఆ తర్వాత అతడి ఇంట్లోంచి దుర్గంధం వస్తున్నట్టు చుట్టుపక్కలవారు గమనించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి ఇంట్లో తనిఖీ చేయగా.. ఓ ఇనుప ట్రంకుపెట్టెలో ఒంటి మీద వస్త్రాలు లేని స్థితిలో ఆ బాలిక మృతదేహం కనపడింది. ఆమెపై దుప్పటి మాత్రం కప్పి ఉంది. లావణ్య శరీరంపై గాయాలున్నాయి.
మరోవైపు.. ఆస్పత్రికి వెళ్లిన సురేష్ అట్నుంచి అటే పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. లావణ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించబోగా.. సురే్‌షను అరెస్టు చేసేవరకూ అందుకు ఒప్పుకోబోమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు సురే్‌షను అదుపులోకి తీసుకుని విచారించకుండా వదిలి వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు-కైకలూరు రహదారిపై రాస్తారోకోకు దిగారు. సురేష్ తల్లి లక్ష్మిని తీవ్రంగా కొట్టి, ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. గాయాలపాలైన ఆమెను పోలీసులు అతికష్టం మీద ఆందోళనాకారుల నుంచి తప్పించి ఒక ఆటోలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సురేష్ తండ్రి వెంకటేశ్వరరావుపై కూడా గ్రామస్తులు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అతన్ని బాలిక మృతదేహం ఉన్న గదిలోనే దాచారు.
Advertisement