వేం న‌రేంద్ర‌కు ఏసీబీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని అధికారులు బుధవారం సుమారు ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసులో నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల ఫోన్ కాల్‌డేటా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బేరసారాల సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటల వీడియో ఫుటేజీలు, ఏసీబీ కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీపడ్డా.. మీకే ఇవ్వాలని పార్టీ […]

Advertisement
Update:2015-06-18 02:49 IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని అధికారులు బుధవారం సుమారు ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసులో నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల ఫోన్ కాల్‌డేటా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బేరసారాల సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటల వీడియో ఫుటేజీలు, ఏసీబీ కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీపడ్డా.. మీకే ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును రేవంత్ ఒప్పించి టికెట్ ఇప్పించడానికి కారణాలేమిటని అడిగినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ‘వేం నరేందర్‌రెడ్డికి నేనే ఫైనాన్షియర్‌ని. ఆయనకు పట్టుపట్టి టికెట్ ఇప్పించింది నేనే..’ అని రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌తో చెప్పిన మాటలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహతో నరేందర్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌కు చెందిన ఏయే ఎమ్మెల్యేలతో మాట్లాడారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాలపైనా నరేందర్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలులో రేవంత్‌తోపాటు ఎవరున్నారని పలుమార్లు అడిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి వ్యాపార లావాదేవీల గురించి ప్రశ్నించిన ఏసీబీ అధికారులు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిందెవరని, స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలు పోను మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ ఉంచారని ప్రశ్నించినట్లు తెలిసింది. అసలు ఆ రూ.50 లక్షల సొమ్మును రేవంత్ ఎక్కడి నుంచి తెచ్చిచ్చారని గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది.
మొత్తంమీద‌ కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే శక్తి నరేందర్‌రెడ్డికి లేదన్న స్పష్టతకు వచ్చిన ఏసీబీ అధికారులు… ఎవరి ద్వారా సొమ్ము తెచ్చారనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.‘ఈ డీల్ మీకోసమే జరిగినందున ప్రతి విషయం మీకు తెలిసే ఉంటుంది కదా!..’ అని పేర్కొంటూ సమాధానాలు రాబట్టే ప్ర‌యత్నం చేశారు. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీని గెలిపించుకోవడం వల్ల చంద్రబాబుకు ఒనగూరే ప్రయోజనమేమిటని.. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ‘మావాళ్లు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తానని’ బాబు అనడంలో ఆంతర్యం ఏమిటని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై తమ దగ్గరున్న సమాచారాన్ని చెబుతూ.. ఆయా కంపెనీలు, వ్యక్తులకు టీడీపీతో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు తెలిసింది. దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలు అడిగిన ఏసీబీ అధికారుల బృందం… తొలుత తనకేమీ సంబంధం లేదంటూ వేం నరేందర్‌రెడ్డి చెప్పుకొచ్చినా, చివరకు చాలా విషయాలు రాబట్టినట్లు తెలిసింది. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఏసీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆరు గంట‌ల‌పాటు విచారించిన అధికారులు..సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటికి పంపించారు.
Tags:    
Advertisement

Similar News