ట్యాపింగ్‌పై పక్కా ఆధారాలు: కేబినెట్‌లో బాబు
ఆంధ్రా నేతల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు, ఎలా ట్యాపింగ్ జరిగిందో ఆధారాలు ఉన్నాయని మంత్రులకు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ కేసులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన మంత్రులకు సూచించారు. బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు ఆరు గంటలపాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 22న ఏపీ […]
Advertisement
ఆంధ్రా నేతల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు, ఎలా ట్యాపింగ్ జరిగిందో ఆధారాలు ఉన్నాయని మంత్రులకు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ కేసులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన మంత్రులకు సూచించారు. బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు ఆరు గంటలపాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 22న ఏపీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన…. వచ్చే మూడేళ్లలో విజయవాడ మెట్రో రైలు పనులు పూర్తి చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని ప్రకటించాల్సి ఉన్న దృష్ట్యా కర్ణాటకలో అమలవుతున్న మద్యం విధానంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తన గృహ నిర్మాణానికే తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ ఇవ్వడం లేదని చెప్పినట్టు తెలిసింది.
సుమారు ఆరు గంటలకుపైగా సాగిన ఏపీ మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ మైట్రోరైలు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 6823 కోట్లుగా మంత్రి పల్లె తెలిపారు. 2019లోగా మెట్రో పనులు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. హైస్పీడ్ మెట్రో రైలని, 764 ప్రయాణికుల సామర్థ్యం ఉంటుందని, 30 సెకన్లలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు వెళ్లొచ్చని, మొత్తం 25 మెట్రో స్టేషన్లు ఉంటాయని మంత్రి పల్లె వివరించారు. అమరావతికి మెట్రో లింక్ ఉంటుందన్నారు. బందర్‌రోడ్ మీదుగా పెనమలూరు వరకు మెట్రోకారిడార్-1, నెహ్రూ బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్ ఎనికెపాడు వరకు కారిడార్-2 నిర్మిస్తామన్నారు. జపాన్ ప్రభుత్వం సంస్థ జైకా నుంచి రూ.3600 కోట్ల రుణం , కేంద్రం, రాష్ట్రంగా వాటా చెరో రూ.866 కోట్లు నిధుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 22న ఏపీ రాజధానికి శంకుస్థాపన జరుగుతుందని, భారత్, జపాన్, సింగపూర్ ప్రధానులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పల్లె తెలిపారు. శ్రీకాళహస్తి మార్కెట్‌యార్డులోకాపు గున్నెరి సొసైటీ భవనానికి 550 గజాల స్థలం, కార్య నిర్వహక అధికారులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మంగంపేట బెరైటీస్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్ల ఆదాయం లక్ష్యం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పల్లె వివరించారు. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 50 కోట్ల మొక్కలు నాటాలని, ముఖ్యంగా సీఆర్‌డీఏ పరిధిలో 35 లక్షల మొక్కలు, రైతులతో 6 కోట్ల మొక్కలు నాటాలని, విజయవాడ, విశాఖలో ఏరియల్ ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని, వచ్చే కేబినెట్‌లో ప్రైవేట్ ఇండస్ట్రియల్ బిల్లు చర్చకు వస్తుందన్న మంత్రి పల్లె కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ఆమోదించినట్లు వివరించారు.
Advertisement