బాబు అవినీతిపై దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి యేడాది పాలనపై ఎంతో అవినీతి జరిగిందని, ఈ కాలంలో జరిగిన అన్ని అంశాలపై దర్యాప్తు జరిపించాలని ఏపీ సీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండు చేశారు. బాబు అవినీతి పాలనపై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షను చేపట్టింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, దేవినేని నెహ్రూ, జేడీ శీలం, ఆనం రామనారాయణరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. వంద […]
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి యేడాది పాలనపై ఎంతో అవినీతి జరిగిందని, ఈ కాలంలో జరిగిన అన్ని అంశాలపై దర్యాప్తు జరిపించాలని ఏపీ సీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండు చేశారు. బాబు అవినీతి పాలనపై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షను చేపట్టింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, దేవినేని నెహ్రూ, జేడీ శీలం, ఆనం రామనారాయణరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. వంద కోట్ల అవినీతికి పట్టిసీమే ప్రత్యక్ష సాక్ష్యమని రఘువీరా అన్నారు. ఏపీ సొమ్ముతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని తెలుగు ప్రజల గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని రఘువీరా ఆరోపించారు.
బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, చంద్రబాబు అవినీతిని భరించలేకపోతున్నారని దేవినేని నెహ్రూ అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలమయ్యారని ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, మహిళల రుణాలు… ఇలా ఏ రంగం చూసుకున్నా ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని ఆయన ఆరోపించారు.
Advertisement