శ్మశానంలో దొంగలు పడ్డారు 

కాదేదీ దొంగతనానికి అనర్హం అన్న రీతీలో శ్మశానాలను కూడా దొంగలు వదలటం లేదు. ఒకవైపు శ్మశానాలను ఆధునీకరిస్తుంటే మరో వైపు దొంగలు శ్మశానాల్లోని విలువైన వస్తువులను అపహరిస్తున్న వైనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థలో వున్న శ్మశానవాటికను పునర్నిర్మించే పనిలో భాగంగా పెదవడ్లపూడి గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి సుమారు రూ.15 లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు నడుం బిగించారు. దీనిలో […]

Advertisement
Update:2015-06-14 09:20 IST

కాదేదీ దొంగతనానికి అనర్హం అన్న రీతీలో శ్మశానాలను కూడా దొంగలు వదలటం లేదు. ఒకవైపు శ్మశానాలను ఆధునీకరిస్తుంటే మరో వైపు దొంగలు శ్మశానాల్లోని విలువైన వస్తువులను అపహరిస్తున్న వైనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థలో వున్న శ్మశానవాటికను పునర్నిర్మించే పనిలో భాగంగా పెదవడ్లపూడి గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి సుమారు రూ.15 లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు నడుం బిగించారు. దీనిలో భాగంగా ఇటీవల శ్మశానం నలువైపులా మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు మృతి చెందిన వారి కర్మకాండల నిర్వహణకు సంబంధించి వాటర్‌ ట్యాంకు నిర్మాణం తదితర పనులు చేపట్టారు. అయితే బోరింగ్‌ నిర్మాణం చేపట్టి దానికి కావలసిన మోటార్లు, పైపులు, షవర్లు అన్నింటినీ రెండు రోజుల క్రితమే కమిటీ సభ్యులు ఏర్పాటు చేయగా గుర్తుతెలియని వ్యక్తులు సదరు బోరింగ్‌ మోటారు, పైపులు, షవర్లతోపాటు అక్కడ వున్న సామాను మొత్తాన్ని దొంగిలించుకుపోయారు. దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.15 వేల వరకు వుంటుందని శ్మశానవాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు మాదల రమేష్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News