శ్రీవారి నామాలు దిద్దడం నిర్లక్ష్యం... పురోహితుడి సస్పెన్షన్
శ్రీవారికి నామాలు పెట్టడం కూడా చేతగాని ఓ అర్చకుడిని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేయడంతో టీటీడీలో కొత్త వివాదం మొదలయ్యింది. శ్రీ వేంకటేశ్వరస్వామికి నామం సరిగా లేదని, ఆయనకు నామాలు దిద్దడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరంటూ పెద జియ్యర్ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నెల రోజుల పాటు నిఘా పెట్టిన అధికారులు నామంలో లోపం ఉందని గుర్తించారు. పెద జియ్యర్ స్వామి ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి […]
Advertisement
శ్రీవారికి నామాలు పెట్టడం కూడా చేతగాని ఓ అర్చకుడిని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేయడంతో టీటీడీలో కొత్త వివాదం మొదలయ్యింది. శ్రీ వేంకటేశ్వరస్వామికి నామం సరిగా లేదని, ఆయనకు నామాలు దిద్దడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరంటూ పెద జియ్యర్ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నెల రోజుల పాటు నిఘా పెట్టిన అధికారులు నామంలో లోపం ఉందని గుర్తించారు. పెద జియ్యర్ స్వామి ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి దృష్టికి తీసుకురాగా శ్రీవారి అభిషేకం సేవల నుంచి సదరు పురోహితుడ్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పురోహితుడ్ని సస్పెండ్ చేస్తే ఆయనకు ఎందుకు కోపం వచ్చిందనుకుంటే పొరపాటే… ఇంతకీ సదరు పురోహితుడు రమణ దీక్షితుల పుత్రరత్నం రాజీవ్ దీక్షితులు. నామాలు దిద్దడం నేర్చుకుని రావాలని సూచిస్తూ రాజీవ్ దీక్షితులను ఆరు నెలల పాటు అభిషేకం సేవల నుంచి టీటీడీ పాలక మండలి దూరం పెట్టింది.
Advertisement