నీటితోనే మన ఆరోగ్యం
వేసవితాపాన్ని తట్టుకోలేక రోజంతా మనం మంచినీరు తాగుతూనే ఉంటాం. అయితే వేసవి ముగిసిన తర్వాత వర్షాకాలం, శీతాకాలంలో మన శరీరానికి ఎక్కువ నీటి అవసరం ఉండదని భావిస్తాం. టిఫిన్ చేసినపుడో లేదంటే భోజనం తర్వాత మాత్రమే మనకు నీరు గుర్తుకొస్తుంది. కానీ ఏ కాలంలోనైనా మన శరీరానికి మంచినీరు దివ్యమైన ఔషధమని పరిశోధకులంటున్నారు. కాలంతో నిమిత్తం లేకుండా పురుషులు రోజుకు కనీసం మూడు లీటర్లు, మహిళలు కనీసం 2.5 లీటర్ల నీరు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ మంచినీరు […]
Advertisement
వేసవితాపాన్ని తట్టుకోలేక రోజంతా మనం మంచినీరు తాగుతూనే ఉంటాం. అయితే వేసవి ముగిసిన తర్వాత వర్షాకాలం, శీతాకాలంలో మన శరీరానికి ఎక్కువ నీటి అవసరం ఉండదని భావిస్తాం. టిఫిన్ చేసినపుడో లేదంటే భోజనం తర్వాత మాత్రమే మనకు నీరు గుర్తుకొస్తుంది. కానీ ఏ కాలంలోనైనా మన శరీరానికి మంచినీరు దివ్యమైన ఔషధమని పరిశోధకులంటున్నారు. కాలంతో నిమిత్తం లేకుండా పురుషులు రోజుకు కనీసం మూడు లీటర్లు, మహిళలు కనీసం 2.5 లీటర్ల నీరు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ మంచినీరు తాగడం వల్ల మనకు లభించేదేమిటి? మన ఆరోగ్యాన్ని మంచినీరు ఎలా ప్రభావితం చేస్తుంది? మంచినీటితో అనేక రకాల ఉపయోగాలున్నాయి. మన శరీరంలోని వేడిని అది నియంత్రిస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుందని పరిశోధనలలో తేలింది. మనం తీసుకనే ఆహారాన్ని శక్తిగా మలచడంలో నీరు ముఖ్యపాత్ర వహిస్తుంది. వివిధ శరీర భాగాలలోని కణాలకు ఆక్సిజన్ ఇతర పోషకాలను సరఫరా చేసేది నీరే. నీటిలో ఉండే ఆక్సిజన్ ఊపిరితిత్తులను ఉత్తేజపరుస్తాయి. ఆహారం సులువుగా జీర్ణం కావడానికి మంచినీరే మార్గం. అంతేకాదు మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో నీటిదే కీలకపాత్ర. తగినంత నీరు తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌ను 55శాతం నివారించవచ్చని పరిశోధనలలో తేలింది. నీటివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
Advertisement