బాలయ్యే భవిష్యత్ సీఎం: తలసాని
ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు త్వరలో జైలుకెళ్ళడం ఖాయమని, ముఖ్యమంత్రిగా ఆయన స్థానంలో నందమూరి బాలకృష్ణ రావడం అంతే నిజమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జోస్యం చెప్పారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రూ. ఐదు కోట్లకు కొనుగోలు చేయాలని చూసి, రూ. 50 లక్షలు చెల్లించి అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసు నుంచి బాబును ఎవరూ కాపాడలేరని తలసాని అన్నారు. పైగా ఢిల్లీ వెళ్ళి ఉన్న పరువు కాస్తా పోగొట్టుకుంటున్నారని ఆయన […]
Advertisement
ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు త్వరలో జైలుకెళ్ళడం ఖాయమని, ముఖ్యమంత్రిగా ఆయన స్థానంలో నందమూరి బాలకృష్ణ రావడం అంతే నిజమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జోస్యం చెప్పారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రూ. ఐదు కోట్లకు కొనుగోలు చేయాలని చూసి, రూ. 50 లక్షలు చెల్లించి అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసు నుంచి బాబును ఎవరూ కాపాడలేరని తలసాని అన్నారు. పైగా ఢిల్లీ వెళ్ళి ఉన్న పరువు కాస్తా పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. చేసిన తప్పు బయట పడిన తర్వాత కూడా తాను తప్పించుకోవాలని చూస్తూ సమస్యను రెండు రాష్ట్రాలకు సంబంధించినదిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని అన్నారు. ఈ కేసులో నాలుగో ముద్దాయి విజయవాడలో తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులకు అప్పగించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఇప్పటివరకు చిన్న సంఘటన కూడా జరగలేదని, కాని చంద్రబాబుకు శాంతిభద్రతల సమస్య కనిపిస్తోందని తలసాని ఎద్దేవా చేశారు.
Advertisement