మహబూబ్‌నగర్‌లో అమెజాన్ గోదాము

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరణకు అమెరికాకు చెందిన అమెజాన్‌ ప్రాధాన్యం ఇస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో దేశంలో అతిపెద్ద గోదాము (ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్) కార్యకలాపాలను కంపెనీ ప్రారంభించింది. త్వరలోనే హైదరాబాద్‌లో మరో గోదాము ఏర్పాటుకు కంపెనీ సుముఖంగా ఉంది. నానక్‌రామ్‌గూడలో అతిపెద్ద క్యాంపస్‌ ఏర్పాటుకు కూడా కంపెనీ సన్నద్ధం అవుతోంది. దీంతోపాటు తెలంగాణలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ల కోసం డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. అమెజాన్‌ గోదామును ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ ఐటి […]

Advertisement
Update:2015-06-12 04:33 IST
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరణకు అమెరికాకు చెందిన అమెజాన్‌ ప్రాధాన్యం ఇస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో దేశంలో అతిపెద్ద గోదాము (ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్) కార్యకలాపాలను కంపెనీ ప్రారంభించింది. త్వరలోనే హైదరాబాద్‌లో మరో గోదాము ఏర్పాటుకు కంపెనీ సుముఖంగా ఉంది. నానక్‌రామ్‌గూడలో అతిపెద్ద క్యాంపస్‌ ఏర్పాటుకు కూడా కంపెనీ సన్నద్ధం అవుతోంది. దీంతోపాటు తెలంగాణలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ల కోసం డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. అమెజాన్‌ గోదామును ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అమెజాన్‌ విస్తరణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నానక్‌రామ్‌ గూడలో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్‌ క్యాంపస్‌ అభివృద్ధి కానుందని, అమెరికా వెలువల ఏర్పాటవుతున్న అతిపెద్ద క్యాంపస్‌ ఇదేనని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ క్యాంపస్‌ కోసం 10 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. త్వరలోనే దీని నిర్మాణ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో మరో భారీ గోదాము ఏర్పాటు చేసేందుకు అమెజాన్‌ సుముఖ వ్యక్తం చేసిందని చెప్పారు. నిర్మల్‌ బొమ్మలు, గద్వాల, పోచంపల్లి చీరలతోపాటు తెలంగాణలోని వివిధ రకాల హస్తకళ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించేందుకు అమెజాన్‌తో కలిసి ఒక ఇకామర్స్‌ వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు కెటిఆర్‌ తెలిపారు.
Tags:    
Advertisement

Similar News