చర్లపల్లి జైలుకు రేవంత్ తరలింపు
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్థం ముగిసిన వెంటనే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్ళిపోయారు. నిజానికి ఆయనకు సాయంత్రం 6 గంటల వరకు తాత్కాలిక బెయిల్ సమయం ఉన్నా, చర్లపల్లి జైలు నగరానికి దూరంగా ఉండటంతో ముందుగానే ఆయన బయల్దేరినట్లు తెలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన నిఘా మధ్య రేవంత్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు. ఉదయం 8.45 గంటలకు తన ఇంటి నుంచి ఎన్ కన్వెన్షన్ […]
Advertisement
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్థం ముగిసిన వెంటనే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్ళిపోయారు. నిజానికి ఆయనకు సాయంత్రం 6 గంటల వరకు తాత్కాలిక బెయిల్ సమయం ఉన్నా, చర్లపల్లి జైలు నగరానికి దూరంగా ఉండటంతో ముందుగానే ఆయన బయల్దేరినట్లు తెలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన నిఘా మధ్య రేవంత్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు. ఉదయం 8.45 గంటలకు తన ఇంటి నుంచి ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. గంటన్నర పాటు కుటుంబ సభ్యులతోను మరికొందరు నాయకులతోను గడిపారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆయనే స్వచ్ఛందంగా బయటకు వచ్చి, తనను తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనంలోకి ఎక్కారు. వెంటనే ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు జైలుకు బయల్దేరారు. రెండు గంటల సమయం ఉన్నప్పటికీ ఆయన ముందే బయల్దేరినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ఉండేందుకే ఆయన పూర్తిగా నిబంధనలు పాటించినట్లు తెలిసింది.
కాగా అంతకుముందు బెయిలుపై విడుదలైన రేవంత్‌రెడ్డి తుళ్లుతూ, నవ్వుతూ కనిపించారు. రేవంత్‌లో ఏసీబీ కేసుపై ఎలాంటి ఆందోళన కనిపించలేదు. రేవంత్ ఉల్లాసంగా కూతురి నిశ్చితార్ధం కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమార్తె నైమిశ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఎన్‌కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీలు గుత్తా, పాల్వాయి, బీజేపీ నేత నాగం, కాంగ్రెస్ నేత దానం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.
Advertisement