ఢిల్లీ విల్లెకర్లపై చంద్రబాబు రుసరుస....
రెండు రాష్ర్టాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్రెడ్డి విషయంపై ఒక్క మాట మాట్లాడకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభస్తాడని వ్యాఖ్యానించడంతో సంచలనం రేగింది. అంటే.. రేవంత్రెడ్డి నుంచి టీడీపీ దూరంగా జరుగుతుందా? అన్న చర్చ మొదలైంది. సాయంత్రం ఢిల్లీలో విలేకరుల సమావేశంలోనూ రేవంత్ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడతరనుకున్నా ఆయన మాట్లాడలేదు. ఆడియో టేపులో […]
Advertisement
రెండు రాష్ర్టాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్రెడ్డి విషయంపై ఒక్క మాట మాట్లాడకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభస్తాడని వ్యాఖ్యానించడంతో సంచలనం రేగింది. అంటే.. రేవంత్రెడ్డి నుంచి టీడీపీ దూరంగా జరుగుతుందా? అన్న చర్చ మొదలైంది. సాయంత్రం ఢిల్లీలో విలేకరుల సమావేశంలోనూ రేవంత్ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడతరనుకున్నా ఆయన మాట్లాడలేదు. ఆడియో టేపులో ఉన్న గొంతుమీదా? అని ప్రశ్నించిన విలేకరులపై మండిపడ్డారు. ఒక సీఎంను అడగాల్సిన ప్రశ్నేనా ఇది. ఆయన అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు యత్నించారు. మే 31న స్టీఫెన్సన్ ఇంట్లో విలేకరులపై విరుచుకుపడ్డ రేవంత్రెడ్డిని తలపించారు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇబ్బంది కలిగిన ప్రతిసారీ విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement