రేవంత్‌కి దూరం జరుగుతున్న దేశం?

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ దూరంగా పెడుతోందా? ఔననే అంటున్నారు విశ్లేషకులు. అదేమిటి.. రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి స్వయంగా చంద్రబాబు హాజరౌతున్నారు… అంతేకాదు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా హాజరుకానున్నారు. ఇంతటి ప్రాధాన్యత మరే ఇతర నాయకునికీ ఇంతవరకు ఇవ్వలేదు కదా అనుకుంటున్నారా…. కానీ అదంతా పైపైకేనని, వాస్తవానికి రేవంత్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ దూరంగా జరుగుతున్నదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారానికి తెలుగుదేశం పార్టీకి […]

Advertisement
Update:2015-06-10 11:38 IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ దూరంగా పెడుతోందా? ఔననే అంటున్నారు విశ్లేషకులు. అదేమిటి.. రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి స్వయంగా చంద్రబాబు హాజరౌతున్నారు… అంతేకాదు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా హాజరుకానున్నారు. ఇంతటి ప్రాధాన్యత మరే ఇతర నాయకునికీ ఇంతవరకు ఇవ్వలేదు కదా అనుకుంటున్నారా…. కానీ అదంతా పైపైకేనని, వాస్తవానికి రేవంత్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ దూరంగా జరుగుతున్నదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. చంద్రబాబు నాయుడు పేరు బయటపెట్టవద్దని పలువురు నేతల ద్వారా రేవంత్ వద్దకు రాయబారాలు వెళ్లినప్పటికీ ఆయన చంద్రబాబు పేరు చెప్పేశారని, బాస్ చంద్రబాబేనని ఏసీబీ అధికారుల వద్ద ఒప్పుకున్నారని సమాచారం. అందుకే బాబు ఆయనపై కోపంగా ఉన్నారట. తగిన జాగ్రత్తలు తీసుకోకపోగా తననూ ఇందులోకి లాగడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. రేవంత్‌కు బెయిల్ దొరుకుతుందో లేదోనన్న పరిస్థితుల్లో పార్టీ నాయకులంతా ఆయన కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లి ఆయనకు మద్దతుగా ఉన్నట్లు తెలియజేయాలనుకున్నారట. కానీ రేవంత్‌కు బెయిల్ దొరకడం, అంతకు ముందే ఆయన ఏసీబీ అధికారులకు అన్ని విషయాలూ చెప్పేయడం వంటి వి చోటు చేసుకున్నాయి. అందుకే రేవంత్‌కు దూరం జరగడానికి తెలుగుదేశం పార్టీ హడావిడిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Tags:    
Advertisement

Similar News