ఏసీ రెస్టారెంట్లలోనే సేవా పన్ను
ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) లేదా సెంట్రల్ హీటింగ్ (సీహెచ్) సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే సేవల పన్ను వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ హీటింగ్ లేని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి సేవల పన్నునూ వసూలు చేయనవసరం లేదని, ఏసీలేని హోటళ్లు, మెస్సులు. ఫుడ్ కోర్టులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుందని ఈ శాఖ పేర్కొంది. ఒకవేళ ఏసీ, సీహెచ్ సదుపాయం ఉంటే మొత్తం బిల్లు సొమ్ములో […]
Advertisement
ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) లేదా సెంట్రల్ హీటింగ్ (సీహెచ్) సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే సేవల పన్ను వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ హీటింగ్ లేని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి సేవల పన్నునూ వసూలు చేయనవసరం లేదని, ఏసీలేని హోటళ్లు, మెస్సులు. ఫుడ్ కోర్టులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుందని ఈ శాఖ పేర్కొంది. ఒకవేళ ఏసీ, సీహెచ్ సదుపాయం ఉంటే మొత్తం బిల్లు సొమ్ములో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతానికి మాత్రమే సేవల పన్ను ఉంటుందని, ఈ విధంగా చూస్తే మొత్తంగా సేవల పన్ను (ఎఫెక్టివ్ రేట్) 5.6 శాతంగా ఉంటుందని వివరించింది. సేవల పన్ను వర్తించ కూడదంటే… రెస్టారెంట్‌లోని ఏ భాగంలోనూ ఏసీ లేదా సీహెచ్‌లు ఉండకూడదని పేర్కొంది. జూన్ 1 నుంచీ సేవల పన్నును 14 శాతానికి (విద్యా సుంకాన్ని కలుపుకుని) పెంచారు. దీని ప్రకారం, చార్జ్ చేసిన మొత్తంపై ఎఫెక్టివ్ రేటు 5.6 శాతం ఉంటుంది. జూన్ 1కి ముందు 12.36 శాతం సేవల పన్ను ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రేట్ 4.94 శాతం మాత్రమేనని పేర్కొంది. జూన్ 1 నుంచీ సేవల పన్ను పెంపు వల్ల అనేక రంగాల వినియోగదారులపై భారం పడిన విషయం తెలిసిందే. సేవల పన్ను ద్వారా కేంద్రానికి గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు లభించగా, తాజా పెంపు వల్ల ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట.
Advertisement