చంద్ర‌బాబూ అవినీతిపై క‌దంతొక్కిన వైసీపీ శ్రేణులు

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబునాయుడు త‌న ప‌ద‌వికి వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండు చేస్తూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధ‌ర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, మాన‌వ హారాల‌తో క‌దం తొక్కాయి. చంద్ర‌బాబునాయుడు అవినీతికి ఎల్ల‌లు లేవ‌ని, ఆయ‌న ఎవ‌రినైనా మ్యానేజ్ చేయ‌గ‌ల స‌మ‌ర్ధుడ‌ని వారు ఆరోపించారు. ఇలాంటి ముఖ్య‌మంత్రి ఉంటే రాష్ట్రం […]

Advertisement
Update:2015-06-09 07:43 IST
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబునాయుడు త‌న ప‌ద‌వికి వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండు చేస్తూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధ‌ర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, మాన‌వ హారాల‌తో క‌దం తొక్కాయి. చంద్ర‌బాబునాయుడు అవినీతికి ఎల్ల‌లు లేవ‌ని, ఆయ‌న ఎవ‌రినైనా మ్యానేజ్ చేయ‌గ‌ల స‌మ‌ర్ధుడ‌ని వారు ఆరోపించారు. ఇలాంటి ముఖ్య‌మంత్రి ఉంటే రాష్ట్రం భ్ర‌ష్టు ప‌ట్టిపోతుంద‌ని వైసీపీ నాయ‌కుడు ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యేని కొన‌డానికి రూ. ఐదు కోట్ల రూపాయ‌లు వెచ్చించే ఆలోచ‌న చేశారంటే రాష్ట్రంలో ఎంత అవినీతి జ‌రిగిందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని వారు వ్యాఖ్యానించారు. తిరుప‌తి నుంచి అనంత‌పురం వ‌ర‌కు…. నెల్లూరు నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కులు, వివిధ శ్రేణులు క‌దం తొక్కాయి.
తిరుప‌తిలో భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ల‌క్ష్మీపార్వ‌తి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా భూమ‌న మాట్లాడుతూ చంద్రాబాబు అవినీతికి హ‌ద్దులు లేవ‌ని, ఆయ‌న బ‌తుకంతా అవినీతి మ‌య‌మ‌ని ఆరోపించారు. బాబు మేక వ‌న్నె పులి అని, అవినీతిలో అందె వేసిన చెయ్యి అని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. ఎమ్మెల్యేల‌ను కొన‌డం ఏపీ సీఎంకు వెన్న‌తో పెట్టిన విద్య అని ఆమె విమ‌ర్శించారు. శ్రీ‌కాకుళం ఏడు రోడ్ల జంక్ష‌న్‌లో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆధ్వ‌ర్యంలో, రాజాంలో ఎమ్మెల్యే జోగులు, ఆముదాలవ‌ల‌స‌లో త‌మ్మినేని ఆధ్వ‌ర్యంలో మాన‌వ హారంతో నిర‌సన తెలిపారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల‌లో ఎమ్మెల్యే అప్ప‌ల‌నాయుడు, పాల‌కొండ‌లో ఎమ్మెల్యే ధ‌ర్నాలో పాల్గొని నిర‌స‌న తెలిపారు.
తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌లో జ్యోతుల నెహ్రూ, కాకినాడ మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట‌ ద్వారంపూడి ఆధ్వ‌ర్యంలో ర్యాలీ జ‌రిగింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, ర్యాలీ జ‌రిగింది. విజ‌య‌వాడ‌లో ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌, మాజీ మంత్రి పార్థ‌సార‌ధి, నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్‌, పామ‌ర్రులో ఉప్పులేటి క‌ల్ప‌న, గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ధ‌ర్నా నిర్వ‌హించి నిర‌స‌న తెలిపారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఆత్మ‌కూరులో ఎమ్మెల్యే మేక‌పాటి గౌతంరెడ్డి, కావ‌లిలో రాంరెడ్డి ప్ర‌తాప‌కుమార్ రెడ్డి, వెంక‌టాచ‌లంలో ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, బ‌ద్వేలులో జ‌య‌రాములు, రైల్వేకోడూరులో కోరుముట్ల శ్రీ‌నివాసులు, రాజంపేట‌లో వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర‌నాథ‌రెడ్డి, క‌డ‌ప‌లో మేయ‌ర్ సురేష్‌బాబు, పులివెందుల‌లో వై.ఎస్. వివేకానంద‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి, మ‌ద‌న‌ప‌ల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ద్వార‌కానాథ‌రెడ్డి, చిత్తూరు జిల్లా న‌గ‌రిలో ఎమ్మెల్యే రోజా, క‌ర్నూలులో ఎమ్మెల్యే గౌరు చ‌రిత‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజ‌య్య ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌పురం జిల్లాలోని ఎస్కె యూనివ‌ర్శిటీలో వైఎస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం బంద్ పాటించింది. చంద్ర‌బాబునాయుడు వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండు చేసింది. క‌దిరిలో చాంద్‌భాషా ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా జ‌రిగింది.
Tags:    
Advertisement

Similar News