రేవంత్‌తో స‌హా ఆ ముగ్గురి ఇళ్లలో ఏసీబీ సోదాలు

ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నిందితులు రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితోపాటు మిగిలిన ఇద్ద‌రు నిందితుల‌ ఇళ్లల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ అరెస్టయిన విషయం తెలిసిందే. గ‌త మూడు రోజులుగా ఎసీబీ క‌స్ట‌డీలో […]

Advertisement
Update:2015-06-09 02:30 IST
ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నిందితులు రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితోపాటు మిగిలిన ఇద్ద‌రు నిందితుల‌ ఇళ్లల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ అరెస్టయిన విషయం తెలిసిందే. గ‌త మూడు రోజులుగా ఎసీబీ క‌స్ట‌డీలో ఉన్న వీరు ముగ్గురు ఇచ్చిన స‌మాచారంలో అధికారుల‌కు ల‌భించిన స‌మాచార‌మే ఈ సోదాల‌కు కార‌ణంగా తెలుస్తోంది. వాస్త‌వానికి విచార‌ణ స‌మ‌యంలో రేవంత్ ఆ యాభై ల‌క్ష‌ల గురించిగాని, మిగ‌తా మొత్తం గురించిగాని త‌న‌కేమీ తెలియ‌ద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే మిగిలిన ఇద్ద‌రు నిందితులు ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే ఎసీబీ అధికారులు ఈ ముగ్గురి ఇళ్ళ‌ల్లో సోదాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    
Advertisement

Similar News