రాష్ట్ర విభజన పాపం బాబు, జగన్‌లదే: రఘువీరా
ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను విభజించే రాజకీయం చేశారని ఏపీ పీసీసీ నేత ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ విభజన పాపం తమపై నెట్టి చంద్రబాబు అధికారం అనుభవిస్తుండగా, ఏం చేయాలో తెలియని జగన్ ఓదార్పు పేరుతో ఊళ్ళన్నీ తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో భారతీయ జనతాపార్టీతో జత కట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఆ పార్టీని నిలదీయడం లేదని […]
Advertisement
ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను విభజించే రాజకీయం చేశారని ఏపీ పీసీసీ నేత ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ విభజన పాపం తమపై నెట్టి చంద్రబాబు అధికారం అనుభవిస్తుండగా, ఏం చేయాలో తెలియని జగన్ ఓదార్పు పేరుతో ఊళ్ళన్నీ తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో భారతీయ జనతాపార్టీతో జత కట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఆ పార్టీని నిలదీయడం లేదని రఘువీరా ప్రశ్నించారు. ఈ యేడాది పాలనలో చంద్రబాబు సాధించింది ఏదీ లేదని, పునరంకితం పేరుతో నవ నిర్మాణ దీక్ష చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలకు అండగా నిలబడి అభివృద్ధి పనులు చేపట్టే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.
Advertisement