రేవంత్ సంభాషణల వీడియో విడుదల
ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను వీడియోలో చిత్రీకరించారు. ఇలా రేవంత్, స్టీఫెన్‌ల మధ్య రికార్డు చేసిన వీడియో నిడివి 22 నిమిషాల పాటు సంభాషణలు సాగాయి. వీటిని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో […]
ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను వీడియోలో చిత్రీకరించారు. ఇలా రేవంత్, స్టీఫెన్‌ల మధ్య రికార్డు చేసిన వీడియో నిడివి 22 నిమిషాల పాటు సంభాషణలు సాగాయి. వీటిని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్‌కు హామీ ఇచ్చారు. మీకు ఎంత డబ్బు కావాలో చెబితే ఇప్పుడే ఇచ్చెస్తాం, మా బాస్ తో మాట్లాడి మీకు ఏం కావాలో చెబితే ఫైనలైజ్ చేస్తానని రేవంత్ ఈ చర్చలో స్టీఫెన్‌కు హామీ ఇచ్చారు.