గర్భిణీ భార్యను రైలు నుంచి తోసేసిన దుర్మార్గుడు
భార్య గర్భిణీగా ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కదులుతున్న రైలు నుంచి తోసేశాడో దుర్మార్గపు భర్త. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే.. ఎదురు సీటులో కూర్చున్న ఓ అమ్మాయితో ఇక ఇకలు పకపకలతో భర్త మాట్లాడం సహించలేక వారించడమే. తను మాట్లాడుతుంటే అడ్డు పడుతున్న భార్యపై విపరీతమైన కోపం వచ్చిందా పశుజాతికి చెందిన ఆ మొగుడికి. వారించాడు… నోరు మూయమన్నాడు… అదుపులో పెట్టుకోమన్నాడు… భార్య కూడా అదే స్థాయిలో మాట్లాడింది. అంతే ఇంకేమీ ఆలోచించలేదు. […]
Advertisement
భార్య గర్భిణీగా ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కదులుతున్న రైలు నుంచి తోసేశాడో దుర్మార్గపు భర్త. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే.. ఎదురు సీటులో కూర్చున్న ఓ అమ్మాయితో ఇక ఇకలు పకపకలతో భర్త మాట్లాడం సహించలేక వారించడమే. తను మాట్లాడుతుంటే అడ్డు పడుతున్న భార్యపై విపరీతమైన కోపం వచ్చిందా పశుజాతికి చెందిన ఆ మొగుడికి. వారించాడు… నోరు మూయమన్నాడు… అదుపులో పెట్టుకోమన్నాడు… భార్య కూడా అదే స్థాయిలో మాట్లాడింది. అంతే ఇంకేమీ ఆలోచించలేదు. కూర్చున్న సీట్లోంచి లేపి పక్కకు తీసుకువచ్చి రైలు నుంచి తోసేశాడు. ఫలితంగా ఆమె విఫరీతమైన గాయాలతో పట్టాలపై పడిపోయింది. దీన్ని గమనించిన రైల్వే పోలీసులు వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు ఆమె గర్భం పోయినట్టు చెప్పారు. ఈ సంఘటన కోరాపుట్-రాయగడ్ స్టేషన్ల మధ్య ర్యాలీ స్టేషన్ వద్ద జరిగింది. ఈ భార్యాభర్తలిద్దరి పేర్లు సురఖ్ కేర్కాట్, సరోజిని కేర్కాట్. కోరాపుట్‌లోని తమ బంధువుల ఇంటికెళ్ళి తిరిగి తమ ఊరు రూర్కెల వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. తన పట్ల అమానుషంగా ప్రవర్తించి గర్భం పోవడానికి కారణమైన భర్తను కఠినంగా శిక్షించాలని సరోజిని పోలీసులను కోరింది. గిరిజన తెగకు చెందిన సరోజిని సంప్రదాయబద్దమైన అమ్మాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన తర్వాత భర్త సురఖ్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఈ సంఘటనకు కారణమైన యువతి కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Advertisement