సంచలనం... నవవధువు ఆత్మహత్య?
విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన చలసాని సౌజన్య మృతి సంచలనం రేకిత్తిస్తోంది. వారం రోజుల క్రితమే చలసాని సౌజన్యకు హైదరాబాద్‌కి చెందిన దిలీప్‌తో వివాహమైంది. వివాహమైన తర్వాత వధూవరులు ఇద్దరూ కలిసి తిరుమల కూడా వెళ్ళి వచ్చారు. కూకట్‌పల్లిలో ఉంటున్న భార్యభర్తలిద్దరూ విజయవాడ వచ్చారు. వాస్తవానికి సౌజన్య మరణించిన రోజు ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. కాని ఎందుకో ఆమె వెళ్ళలేదు. విజయవాడలోనే ఉండిపోయింది. సౌజన్య హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని […]
Advertisement
విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన చలసాని సౌజన్య మృతి సంచలనం రేకిత్తిస్తోంది. వారం రోజుల క్రితమే చలసాని సౌజన్యకు హైదరాబాద్‌కి చెందిన దిలీప్‌తో వివాహమైంది. వివాహమైన తర్వాత వధూవరులు ఇద్దరూ కలిసి తిరుమల కూడా వెళ్ళి వచ్చారు. కూకట్‌పల్లిలో ఉంటున్న భార్యభర్తలిద్దరూ విజయవాడ వచ్చారు. వాస్తవానికి సౌజన్య మరణించిన రోజు ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. కాని ఎందుకో ఆమె వెళ్ళలేదు. విజయవాడలోనే ఉండిపోయింది. సౌజన్య హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. తల్లిదండ్రులు ఓ పంక్షన్‌కు వెళ్ళిన సమయంలో వారు నివాసముంటున్న భవనం మూడో అంతస్తు నుంచి ఆమె దూకేసింది. అయితే ఆమె భవనం నుంచి పడిపోవడం ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనే విషయం తేలాల్సి ఉంది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఆమె మధ్యాహ్నం 2.45 నిమషాలకు ఇంటికి చేరింది. ఇంట్లో హ్యాండ్ బ్యాగ్ పడేసి ఆమె భవనం పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది. మెట్లు వద్ద తలుపు ఉండడంతో ఆమె మళ్ళీ కిందకే వచ్చేసింది. మధ్యాహ్నం 3.04 నిమషాల ప్రాంతంలో ఆమె భవనంపై నుంచి దూకేసింది. కింద పడిపోయిన తర్వాత కూడా ఆమె చాలాసేపు ఎవరూ చూడక పోవడంతో అలాగే ఉండిపోయింది. కొంతసేపటి తర్వాత చూసే సరికి మరణించి ఉంది. ఈ విషయాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయి ఉన్నాయి. వారం రోజుల క్రితమే పెళ్ళి జరగడంతో ఆమెకు ఇష్టం లేని పెళ్ళి చేశారా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె ఫోన్‌లోని కాల్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలు తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Advertisement