మోడీది ‘సెల్ఫీ’ పాలన: నితీశ్ కుమార్
కేంద్ర కేబినెట్‌లోని మంత్రులందరూ తీసుకున్న సెల్ఫీల కంటే.. ఈ ఏడాదిలో పాలనలో ప్రధాని మోడీ దిగిన సెల్ఫీలే ఎక్కువని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. సెల్ఫ్‌లెస్ (నిస్వార్థ) పాలన కావాలని ప్రజలు ఆయనకు పట్టం కడితే.. ఆయన మాత్రం దాన్ని సెల్ఫీ (వ్యక్తి కేంద్రంగా)గా మార్చేశారని ఆయన అన్నారు. వీనుల విందుగా అనిపించే ఇలాంటి మాటలతో పేద ప్రజల కడుపులు నిండవని, ఓ గృహిణి, నిరుద్యోగి, రైతు, ఉద్యోగి, చేతిపనివాడు, విద్యావేత్త.. ఇలా ఏడాది క్రితం […]
Advertisement
కేంద్ర కేబినెట్‌లోని మంత్రులందరూ తీసుకున్న సెల్ఫీల కంటే.. ఈ ఏడాదిలో పాలనలో ప్రధాని మోడీ దిగిన సెల్ఫీలే ఎక్కువని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. సెల్ఫ్‌లెస్ (నిస్వార్థ) పాలన కావాలని ప్రజలు ఆయనకు పట్టం కడితే.. ఆయన మాత్రం దాన్ని సెల్ఫీ (వ్యక్తి కేంద్రంగా)గా మార్చేశారని ఆయన అన్నారు. వీనుల విందుగా అనిపించే ఇలాంటి మాటలతో పేద ప్రజల కడుపులు నిండవని, ఓ గృహిణి, నిరుద్యోగి, రైతు, ఉద్యోగి, చేతిపనివాడు, విద్యావేత్త.. ఇలా ఏడాది క్రితం మోడీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు ఇలా ఎవరిని అడిగినా ఈ ఏడాది పాలనలో మోడీ సర్కార్ తమకు ఏమీ చేయలేదని కచ్చితంగా చెబుతారని ఆయన అన్నారు. ఇక రాష్ట్రాల పర్యటనల కంటే.. ఎక్కువ సంఖ్యలోనే మోడీ విదేశాల్లో పర్యటించారు. విదేశాంగ ప్రతినిధులు కూడా అన్ని దేశాల్లో పర్యటించి ఉండరు. మోడీ పాలనలో పాకిస్థాన్, చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరాయని, పేదల కోసం ఆయన ఏమీ చేయలేదని. అసలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకూ నెరవేర్చలేదని నితీష్ విమర్శించారు.
Advertisement