ప్రత్యేక హోదా బీజేపీ హామీ కాదు: కన్నా
ప్రత్యేక హోదాపై భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ హామీ ఇవ్వలేదని, తమ పార్టీపై విమర్శలు చేయడం అర్ధం లేదని కాంగ్రెస్ నుంచి బయటపడి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం తగదని ఆయన అన్నారు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్నా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వమే రాజ్యసభలో ప్రత్యేక హోదా […]
Advertisement
ప్రత్యేక హోదాపై భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ హామీ ఇవ్వలేదని, తమ పార్టీపై విమర్శలు చేయడం అర్ధం లేదని కాంగ్రెస్ నుంచి బయటపడి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం తగదని ఆయన అన్నారు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్నా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వమే రాజ్యసభలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని తెలిపారు. విభజన చట్టంలో లేనిది ఏదీ అమలు సాధ్యం కాదని అన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏపీకి వచ్చే నష్టమేమీ లేదని కన్నా వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని కన్నా ప్రశ్నించారు. చంద్రబాబుపై అంత ప్రేమెందుకు…మాపై అంత కక్ష ఎందుకన్నారు. బీజేపీని ప్రశ్నించే వాళ్లు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరని అన్నారు. కొందరు చేతగాక బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
Advertisement