మరో హిట్ పై కన్నేసిన ధనుష్!
వైవిధ్యమైన పాత్రలు చేసే నటుడిగా పేరు తెచ్చుకున్న ‘ధనుష్’ కు టాలీవుడ్ లో 2015 సంవత్సరం బాగా కలిసివస్తోంది. సంక్రాంతికి విడుదలైన “రఘువరన్ బీటెక్”, అనంతరం వచ్చిన అనేకుడు చిత్రాలు విజయవంతమవడంతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు తెలుగులో మరియన్ చిత్రాన్ని అనువదించి, విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2013లో ధనుష్ నటించిన ‘మరియన్’ చిత్రం తమిళంలో మంచి హిట్ సాధించింది. భరత్ బాల దర్శకత్వం, ధనుష్, పార్వతీ మీనన్ల నటన సినిమా విజయంలో […]
Advertisement
వైవిధ్యమైన పాత్రలు చేసే నటుడిగా పేరు తెచ్చుకున్న ‘ధనుష్’ కు టాలీవుడ్ లో 2015 సంవత్సరం బాగా కలిసివస్తోంది. సంక్రాంతికి విడుదలైన “రఘువరన్ బీటెక్”, అనంతరం వచ్చిన అనేకుడు చిత్రాలు విజయవంతమవడంతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు తెలుగులో మరియన్ చిత్రాన్ని అనువదించి, విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2013లో ధనుష్ నటించిన ‘మరియన్’ చిత్రం తమిళంలో మంచి హిట్ సాధించింది. భరత్ బాల దర్శకత్వం, ధనుష్, పార్వతీ మీనన్ల నటన సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. మరియన్ పాత్ర ద్వారా డీగ్లామర్ పాత్రలను వేయడంలో ధనుష్ మరోసారి సక్సెస్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మరియన్ జోసెఫ్ పాత్రలో ధనుష్ జీవించాడు. పనిమలార్ పాత్రలో పార్వతీమీనన్ పరకాయ ప్రవేశం చేసింది.
కథేంటంటే..
తమిళనాడులోని తీర ప్రాంతంలోని ఓ కుగ్రామంలో మరియన్, పనిమలార్ అనే జంట ప్రేమించుకుంటారు. హీరోయిన్ కష్టాలను తీర్చడానికి మరియన్ ఓ షిప్‌లో పనికి చేరతాడు. దాంట్లోనే సూడాన్ వెళ్తాడు. అక్కడ సముద్రపు దొంగలు మరియన్, అతని స్నేహితులను బంధిస్తారు. అనంతరం మరియన్ యజమానికి ఫోన్ చేసి డబ్బులడుగుతారు. వారి మధ్య బేరం కుదరదు. దీంతో మరియన్, అతని మిత్రులను బానిసలుగా మార్చి వెట్టి చాకిరీ చేయిస్తారు. వారి వద్ద మరియన్ చిత్రహింసలు అనుభవిస్తాడు. ఈ సమయంలో ప్రేయసి, ప్రియురాలుల విరహ వేదనను దర్శకుడు కళ్లకు కట్టారు. డబ్బు ఆలస్యమవుతుందన్న కోపంతో చాలాసార్లు మరియన్, అతని మిత్రులను చంపుతామనుకుంటారు దొంగలు. అలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారీ తనవాళ్లను చూడకుండానే కన్నుమూస్తానని మరియన్ పడే ఆవేదన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. చివరికి సముద్రపు దొంగలు డబ్బు తీసుకుని వారిని వదిలేయడంతో కథ సుఖాంతమమవుతుంది. ‘రఘువరన్, అనేకుడు’ చిత్రాల్లో ఉన్న’కమర్షియల్ ఎలిమెంట్స్’ ఈ చిత్రంలో లేవు. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడా? లేదా అన్నది వేచి చూడాలి.
Advertisement