మంత్రి గంటాను కలిసిన ఐఐఎం భూ నిర్వాసితులు..
విశాఖపట్టణం : మరో 24 గంటల్లో ఐఐఎంకు శంకుస్థాపన జరగబోతోంది… దీనికి భూములిచ్చిన వారికి ఇంతవరకు నష్టపరిహారం అందలేదు..దీనితో తమ బాధ చెప్పుకుందామని రెవిన్యూ మంత్రి కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరికి మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లారు. విశాఖలో ఐఐఎంకు భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించాలని అభ్యర్థించారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిహారం కోసం భయపడవద్దని గంటా అభయమిచ్చారు. సీఎం, అధికారులు పాజిటివ్ […]
Advertisement
విశాఖపట్టణం : మరో 24 గంటల్లో ఐఐఎంకు శంకుస్థాపన జరగబోతోంది… దీనికి భూములిచ్చిన వారికి ఇంతవరకు నష్టపరిహారం అందలేదు..దీనితో తమ బాధ చెప్పుకుందామని రెవిన్యూ మంత్రి కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరికి మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లారు. విశాఖలో ఐఐఎంకు భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించాలని అభ్యర్థించారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిహారం కోసం భయపడవద్దని గంటా అభయమిచ్చారు. సీఎం, అధికారులు పాజిటివ్ దృక్పథంతో ముందుకెళుతున్నారని తెలిపారు. వారికి న్యాయం చేయాలని ఆలోచనతో అధికారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఐఎంకు రేపు శంకుస్థాపన చేస్తామని మంత్రి గంటా తెలిపారు. పరిహారం మాత్రం తర్వాత(ట)!
Advertisement