రాహుల్ రైతు బాణం... మోడీపై రామబాణం: జైపాల్‌రెడ్డి
రాహుల్ రైతు బాణం మోడీ ప్రభుత్వానికి రామ బాణంలా తగులుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 15 కిలోమీటర్ల రైతు భరోసా పాదయాత్ర అనంతరం ఆదిలాబాద్ జిల్లా వడియాల్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పేద రైతుల భూములు లాక్కుని కోటీశ్వరులకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని, అందుకే భూ సేకరణ బిల్లును సిద్ధం చేస్తుందని జైపాల్ ఆరోపించారు. అంబానీలు, టాటాబిర్లాలు, కోటీశ్వరులదీ బీజేపీ ప్రభుత్వం అని ఆయన […]
Advertisement
రాహుల్ రైతు బాణం మోడీ ప్రభుత్వానికి రామ బాణంలా తగులుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 15 కిలోమీటర్ల రైతు భరోసా పాదయాత్ర అనంతరం ఆదిలాబాద్ జిల్లా వడియాల్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పేద రైతుల భూములు లాక్కుని కోటీశ్వరులకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని, అందుకే భూ సేకరణ బిల్లును సిద్ధం చేస్తుందని జైపాల్ ఆరోపించారు. అంబానీలు, టాటాబిర్లాలు, కోటీశ్వరులదీ బీజేపీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని ఆయన చెప్పారు. రైతుల కోసం రాహుల్ పోరాడితే తామంతా ఆయన వెంటే ఉంటామని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు.
టీఆర్ఎస్ అరాచకపాలన్ని చూస్తూ ఊరుకోం
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి యేడాది కూడా తిరక్కముందే వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్ర పోతున్నారా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నీరు లేక, కరెంట్ లేక, పంటలు లేక నిస్సహాయ స్థితిలో రైతులు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు కనపడడం లేదా… చెవులు వినపడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆరు దశాబ్దాల ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే దీన్ని బంగారు తెలంగాణ చేయడానికి బదులు నాశనం చేస్తున్నారని పీసీసీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకంగా పాలిస్తే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. తెలంగాణలోని వనరులన్నీ ఒకే కుటుంబానికి కాకుండా నాలుగు కోట్ల మందికి చెందాలని భట్టి విక్రమార్క అన్నారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే 900 మంది రైతుల ఆత్మహత్యకు కారణమైన ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాదని నిరూపితమైందని భట్టి ఆరోపించారు.
కాంగ్రెస్ వల్లే తెలంగాణ: జానారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని జానారెడ్డి అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తలచుకుని ఉండకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చేదీ కాదని, కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవించేదీ కాదని జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రే త్యాగాల మయమని, అధికారం లేనప్పుడే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ రైతుల కష్టాల్లో పాలుపంచుకుందని, ఒకేసారి రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. రుణాలు చెల్లించేసిన వారికి కూడా రూ. 5000 చొప్పున చెల్లించిన ఘనత కాంగ్రెస్‌దేనని జానారెడ్డి గుర్తు చేశారు. రైతులకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి డిమాండు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణాలో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్ జిల్లాలోనే అనేకమంది అప్పుల బాధతో చనిపోయారని ఆయన గుర్తు చేశారు.
Advertisement