సత్యం రాజుకు బెయిల్... దోషులకు ఊరట

సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో శిక్షపడిన రామలింగరాజు ఆయన సోదరుడు సహా తొమ్మిది మందికి నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ కోర్టు విధించిన ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష అమలును నిలిపివేసింది. కంపెనీ పద్దుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు సహా కేసుతో సంబంధ‌మున్న మొత్తం 8 మందికి అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ప్రత్యేక కోర్టు ఏప్రిల్‌ 9న ఏడేళ్ల కారాగార శిక్ష, జరిమానాలు విధించింది. శిక్షపడిన […]

Advertisement
Update:2015-05-12 02:30 IST
సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో శిక్షపడిన రామలింగరాజు ఆయన సోదరుడు సహా తొమ్మిది మందికి నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ కోర్టు విధించిన ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష అమలును నిలిపివేసింది. కంపెనీ పద్దుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు సహా కేసుతో సంబంధ‌మున్న మొత్తం 8 మందికి అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ప్రత్యేక కోర్టు ఏప్రిల్‌ 9న ఏడేళ్ల కారాగార శిక్ష, జరిమానాలు విధించింది. శిక్షపడిన వెంటనే దోషులందరినీ పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి కేంద్ర జైలుకు తరలించారు. ఈ తీర్పుపై నిందితులు సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. నెలరోజుల్లోనే బెయిల్‌ లభించడం నిందితులకు ఊరటగా చెప్పవచ్చు. విచారణ కోర్టు విధించిన జైలు శిక్షను, జరిమానా చెల్లించని పక్షంలో అనుభవించాల్సిన జైలు శిక్షను కూడా కోర్టు నిలిపివేసింది. రామలింగరాజు సోదరులకు రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్‌ లభించింది. మిగిలిన వారందరికి రూ.50వేల చొప్పున పూచీకత్తుతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ కోర్టు విధించిన జరిమానాలో పదోవంతు తక్షణమే చెల్లించాలని, విడుదలైన నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించాలని సత్యం దోషులను కోర్టు ఆదేశించింది. లేదంటే శిక్షను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.
Tags:    
Advertisement

Similar News