భూ సేకరణ బిల్లుపై రాహుల్ ఫైర్!
భూ సేకరణ బిల్లుపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ తనదైన శైలిలో స్పందించారు. యూపీఏ ప్రభుత్వం రెండేళ్ళు కష్టపడి తయారు చేసి పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లులో మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని యూపీఏ భూ సేకరణ బిల్లు తెచ్చిందని, కాని ఇపుడు ఎన్డీయే చేస్తున్న సవరణల వల్ల రైతు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆయన […]
Advertisement
భూ సేకరణ బిల్లుపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ తనదైన శైలిలో స్పందించారు. యూపీఏ ప్రభుత్వం రెండేళ్ళు కష్టపడి తయారు చేసి పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లులో మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని యూపీఏ భూ సేకరణ బిల్లు తెచ్చిందని, కాని ఇపుడు ఎన్డీయే చేస్తున్న సవరణల వల్ల రైతు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. సంపన్నుల కొమ్ము కాయడానికి, ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలకు అండగా ఉండడానికి మాత్రమే ఇపుడీ బిల్లులో సవరణలు చేపడుతున్నారని రాహుల్ ఆరోపించారు. దీన్నిబట్టి ఎన్డీయే సర్కారు రైతు వ్యతిరేకి అని అర్దమవుతుందని ఆయన అన్నారు. రైతుల భూముల స్వాహాకు ఎన్డీయే కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. యూపీఏ తెచ్చిన బిల్లును ఎన్డీయే ఖూనీ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని, సస్సంప్రదాయాలను గాలికొదిలేసి బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.
Advertisement