బాలికపై తాపీమేస్ర్తి అత్యాచారం

విశాఖ నగర పరిధిలోని గాజువాకలో ఓ బాలికపై తాపీ మేస్ర్తీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి న్యూ పోర్టు సీఐ శ్రీనివాస్  క‌థ‌నం ప్ర‌కారం… సీతానగరం పల్లె వీధిలో తాపీమేస్ర్తీ సూరిబాబు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న మరో తాపీమేస్ర్తీ నూకరాజు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూరిబాబు కుమార్తె (బాలిక)పై  నూక‌రాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. పనుల నిమిత్తం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సూరిబాబు, అతని భార్య వెంకయ్యమ్మ సాయంత్రం ఇంటికి […]

Advertisement
Update:2015-05-11 18:50 IST
  • whatsapp icon
విశాఖ నగర పరిధిలోని గాజువాకలో ఓ బాలికపై తాపీ మేస్ర్తీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి న్యూ పోర్టు సీఐ శ్రీనివాస్ క‌థ‌నం ప్ర‌కారం… సీతానగరం పల్లె వీధిలో తాపీమేస్ర్తీ సూరిబాబు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న మరో తాపీమేస్ర్తీ నూకరాజు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూరిబాబు కుమార్తె (బాలిక)పై నూక‌రాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. పనుల నిమిత్తం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సూరిబాబు, అతని భార్య వెంకయ్యమ్మ సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత కుమార్తె పరిస్థితిని గమనించి ఆరా తీశారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని వివరించింది. వెంటనే న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో తండ్రి సూరిబాబు ఫిర్యాదు చేశారు. నిందితుడు నూకరాజును న్యూపోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
Tags:    
Advertisement

Similar News