యధావిధిగా ఎంసెట్: గంటా
ఎంసెట్ పరీక్షల తేదీలను మార్చబోమని, ముందు ప్రకటించిన ప్రకారం శుక్రవారం యధావిధిగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎంసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. పెళ్ళిళ్ళు, పరీక్షలు జరుగుతున్నందున ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కోరారు. రాష్ట్రంలోని ప్రయివేటు అద్దె బస్సులన్నీ ఎంసెట్ అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అరగంట ఆలస్యమైనా పరీక్ష అనుమతించవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి గంటా […]
Advertisement
ఎంసెట్ పరీక్షల తేదీలను మార్చబోమని, ముందు ప్రకటించిన ప్రకారం శుక్రవారం యధావిధిగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎంసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. పెళ్ళిళ్ళు, పరీక్షలు జరుగుతున్నందున ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కోరారు. రాష్ట్రంలోని ప్రయివేటు అద్దె బస్సులన్నీ ఎంసెట్ అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అరగంట ఆలస్యమైనా పరీక్ష అనుమతించవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి గంటా తెలిపారు. ఎంసెట్ అభ్యర్థుల తరలింపునకు వందకు పైగా పోలీసు వాహనాలను సమకూరుస్తున్నారు.
Advertisement