కార్పొరేట్లకు కేసీఆర్ రెడ్ కార్పెట్: సీపీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రజా హితం గురించి ఆలోచించకుండా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచే పనిలో నిమగ్నమయ్యారని సీపీఎం నాయకుడు, ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నిరుద్యోగులకు సరైన హామీ ఇవ్వకుండా ముగించారని ఆయన విమర్శించారు. ఐ.టీ. అంటూ ఆయన తనయుడు కేటీఆర్, పరిశ్రమలంటూ ఆయన కార్పొరేట్ల కొమ్ము కాసే పనిలో ఉన్నారని, పేద ప్రజల సంక్షేమం మాట మరిచారని ఆయన […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రజా హితం గురించి ఆలోచించకుండా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచే పనిలో నిమగ్నమయ్యారని సీపీఎం నాయకుడు, ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నిరుద్యోగులకు సరైన హామీ ఇవ్వకుండా ముగించారని ఆయన విమర్శించారు. ఐ.టీ. అంటూ ఆయన తనయుడు కేటీఆర్, పరిశ్రమలంటూ ఆయన కార్పొరేట్ల కొమ్ము కాసే పనిలో ఉన్నారని, పేద ప్రజల సంక్షేమం మాట మరిచారని ఆయన విమర్శించారు. కాకతీయ పేరుతో చేపట్టిన మిషన్ అవినీతి మిషన్ అని, ఇందులో నీతిని ముంచేశారని విమర్శిస్తూ ఇలాంటి మంచి పని అవినీతి రహితంగా చేసుంటే తాము కూడా సమర్ధించేవారమని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ కూడా మాటల పార్టీగానే మనుగడ సాగిస్తుందని… ఉద్యమాలు చేస్తే కాల్చి చంపిన ఘనత తెలుగుదేశంతోపాటు కాంగ్రెస్‌కు కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి బూర్జువా పార్టీలను ఇంటికి పంపించాల్సిన పరిస్థితుల్లో కూడా వాటికే కొమ్ము కాయాల్సి రావడం దురదృష్టకరమని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడానికి తెలంగాణలో అన్ని పక్షాలను కలుపుకుని ప్రజా పోరాటాన్ని నిర్మిస్తామని తమ్మినేని తెలిపారు.
Advertisement